Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Plane crash | అమెరికాలో(America) ఘోర విమాన ప్రమాదం(Plane crash) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురు దుర్మరణం చెందారు.
Plane crash | అమెరికాలో(America) ఘోర విమాన ప్రమాదం(Plane crash) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన విస్కాన్సిన్ డెల్స్ (Wisconsin Dells)సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. మంగళవారం జరిగింది. సాక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మంగళవారం రాత్రి ఆరు సీట్లు, ఒకే ఇంజిన్ కలిగిన పైపర్ PA-46 రకం చిన్న విమానం కెనోషా నుంచి మెనోమోనీకి బయలుదేరింది.
అయితే పైపర్ PA-46 విమానం 24,000 అడుగుల (7,315 మీటర్ల) ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు దాని రెక్కలపై మంచు పేరుకుపోతున్నట్లు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు చెప్పి, కిందికి దిగడానికి అనుమతి కోరాడు. ఇంతలోనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన విస్కాన్సిన్ డెల్స్కు దగ్గరలో ఉన్న మిర్రర్ లేక్ స్టేట్ పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతంలో రాత్రి 10 గంటల సమయంలో కూలిపోయింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తు చేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

