Sheikh Mohamed | యూఏఈ కొత్త అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్
దుబాయి : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్త అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ శనివారం ప్రకటించింది. ఇంతకు ముందు అధ్యక్షుడిగా పని చేసిన షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (73) శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సోదరుడు మొహమ్మద్ బిన్ జాయెద్ (61) దేశానికి మూడో అధ్యక్షుడిగా, ఆయన 2004 నుంచి అబుదాబి క్రౌన్ ప్రిన్స్‌గా పని చేసిన షేక్ మొహమ్మద్ అబుదాబికి 17వ పాలకుడిగా పని చేయనున్నారు. వామ్ ప్రకటన ప్రకారం, అబుదాబిలోని అల్ ముష్రిఫ్ ప్యాలెస్‌లో ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ సమావేశమై యూఏఈ అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
కొత్త అధ్యక్షుడు మళ్లీ ఎన్నికకు అర్హత సాధించడానికి ముందు ఐదేళ్ల పదవీకాలం కోసం పదవీ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయి పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షత వహించగా.. యూఏఈ పాలకులు హాజరయ్యారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ జనవరి 2005 నుంచి యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్‌గా కూడా పనిచేశారు. వ్యూహాత్మక ప్రణాళిక, శిక్షణ, సంస్థాగత నిర్మాణం, రక్షణ సామర్థ్యాలను ప్రోత్సహించడంలో యూఏఈ సాయుధ దళాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

