Senator | ఆమె నన్ను లైంగిక బానిసగా వాడుకున్నారు.. దావా వేసిన మాజీ ఉద్యోగి
Senator | అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర సెనెటర్ (California Senator) మేరీ అల్వరాడో గిల్ (Marie Alvarado-Gil) పెను వివాదంలో చిక్కుకున్నారు. ఆమె వద్ద పని చేసిన ఓ వ్యక్తి సెనెటర్‌పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
Senator : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర సెనెటర్ (California Senator) మేరీ అల్వరాడో గిల్ (Marie Alvarado-Gil) పెను వివాదంలో చిక్కుకున్నారు. ఆమె వద్ద పని చేసిన ఓ వ్యక్తి సెనెటర్‌పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. విధుల్లో ఉన్నప్పుడు ఆమె తనను లైంగిక బానిసగా వాడుకున్నారని సెనెట్ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆరోపించారు. ఫలితంగా తాను ఎంతో వేదనను అనుభవించానంటూ ఆమెపై దావా వేశారు.
2022లో అల్వరాడో గిల్ సెనెటర్‌గా ఎన్నికైన తర్వాత బాధిత వ్యక్తిని తన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించుకుంది. విధుల్లో చేరిన కొన్ని రోజుల నుంచే సెనెటర్ తనతో వ్యక్తిగత విషయాలను పంచుకునేవారని, లైంగిక జీవితానికి సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడేవారని బాధితుడు దావాలో పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి తనపై ఆమె లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
తరచూ అసహజ శృంగారం కోసం డిమాండ్ చేసేవారని, కాదంటే బెదిరించేవారని దావాలో పేర్కొన్నారు. బలవంతంగా కోరికలు తీర్చుకునేవారని తెలిపారు. ఈ వేధింపుల కారణంగా తాను తీవ్రమైన మానసిక, శారీరక వేదనకు గురయ్యానని బాధితుడు వెల్లడించారు. వెన్నునొప్పితో పాటు వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయానని అన్నారు. ఈ కారణం చెప్పి గతేడాది ఆగస్టులో ఆమె డిమాండ్లను వ్యతిరేకించినట్లు తెలిపారు.
దాంతో తన ప్రవర్తన బాగోలేదంటూ సెనెటర్ తనకు నోటీసులు జారీ చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగ భద్రత కోసం ఇన్నాళ్లు తాను ఈ విషయాన్ని బయటపెట్టలేదని తెలియజేశారు. అయితే శాంటాక్లాజ్ కాస్ట్యూమ్స్ వేసుకోలేదన్న కారణంగా గతేడాది డిసెంబరులో తనను విధుల నుంచి తొలగించారని తెలిపారు. తనకు రావాల్సిన వేతన బకాయిలను కూడా ఇవ్వలేదన్నారు.
తనకు జరిగిన నష్టానికిగానూ పరిహారం ఇప్పించాలని కోరుతూ శాక్రామెంటో కౌంటీ సుపీరియర్ కోర్టులో ఆయన దావా వేశారు. అయితే ఈ ఆరోపణలను సెనెటర్ కొట్టిపారేశారు. డబ్బు కోసం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవర్నీ వేధించలేదన్నారు. వాస్తవానికి ఈ సెనెటర్ కొన్ని నెలల కిందట లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా యూఎస్ కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు.
కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మేరీ అల్వరాడో గిల్‌కు వివాహమై ఆరుగురు సంతానం ఉన్నారు. బాధితుడికి కూడా వివాహమైనట్లు దావాలో పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై కోర్టు విచారణ జరపనుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

