ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కూటమి ఓటమి… ఆంథోనీ అల్బనీస్‌కు అభినందనలు
సిడ్నీ: ఆస్ట్రేలియా జాతీయ ఎన్నికల్లో ప్రధాని స్కాట్ మోరిసన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ ప్రభుత్వం ఓడిపోయింది. లేబర్ పార్టీ విజయం సాధించింది. దీంతో శనివారం ఫలితాల అనంతరం స్కాట్ మోరిసన్ ఓటమిని అంగీకరించారు. లేబర్ పార్టీ అధినేత ఆంథోనీ అల్బనీస్‌కు అభినందనలు తెలిపారు. టీవీలో మాట్లాడిన ఆయన తమ ప్రభుత్వానికి ఇది కష్టమైన రాత్రి అని అన్నారు. విపక్ష లేబర్ పార్టీ నేత, కాబోయే ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌కు అభినందనలు తెలియజేసినట్లు చెప్పారు. 2018లో ఆస్ట్రేలియా ప్రధాని ఆయన స్కాట్ మోరిసన్, లిబరల్ పార్టీ పగ్గాలను మరొకరికి అందజేస్తానని తెలిపారు.
కాగా, ఆ దేశ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో మొత్తం 151 సీట్లు ఉన్నాయి. దాంట్లో 76 సీట్లు గెలిచిన వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. లిబరల్-నేషనల్ కూటమితో పాటు లేబర్ పార్టీలు ప్రధానంగా పోటీపడ్డాయి. సుమారు 1.7 కోట్ల ప్రజలు ఎన్నికల్లో ఓటింగ్ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
మరోవైపు ఆస్ట్రేలియా ప్రజల తరపున తాను ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు లేబర్ పార్టీ నేత ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. విభజన, విబేధాలకు వ్యతిరేకంగా తాము ఉద్యమిస్తున్నట్లు చెప్పారు. దీని కోసం ప్రజల్లో ఐకమత్యం తీసుకువస్తామన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

