రచయిత సల్మాన్ రష్డీపై కత్తితో దాడి… న్యూయార్క్లో ఘటన
వాషింగ్టన్: రచయిత సల్మాన్ రష్డీపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అమెరికాలోని న్యూయార్క్లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం చౌటౌక్వా సంస్థలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ రష్డీ, ప్రసంగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతలో ఒక వ్యక్తి ఆ వేదికపైకి దూసుకొచ్చాడు. కత్తితో సల్మాన్ రష్డీ మెడపై పొడిచాడు. ఈ సంఘటనతో సల్మాన్ రష్డీ వేదిక నేలపై పడిపోయారని, అక్కడున్న వారు ఆ వ్యక్తిని అడ్డుకున్నారని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. అక్కడకు వచ్చిన పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారని, సల్మాన్ రష్డీని అక్కడి నుంచి హెలికాప్టర్ అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారని వెల్లడించింది.
కాగా, 75 ఏళ్ల సల్మాన్ రష్డీ భారత సంతతి బ్రిటన్ పౌరుడు. గత 20 ఏళ్లుగా ఆయన అమెరికాలో ఉంటున్నారు. 1980లో ఆయన రచించిన ‘ది సాటానిక్ వెర్సెస్’ పుస్తకం వివాదస్పదమైంది. ఈ పుస్తకాన్ని 1988లో ఇరాన్ నిషేధించింది. నాటి నుంచి ఆయన ప్రాణ ముప్పు, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. రష్డీని చంపాలంటూ ఇరాన్ దివంగత నేత అయతుల్లా రుహోల్లా ఖొమేనీ ఫత్వా జారీ చేశారు. అలాగే ఆయనను చంపిన వారికి మూడు మిలియన్ డాలర్ల రివార్డును కూడా ఇరాన్ ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

