Vladimir Putin | పుతిన్ దక్షిణాఫ్రికా పర్యటన రద్దు.. ఐసీసీ అరెస్ట్ వారెంటే కారణం
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకున్నారు. దేశం దాటి దక్షిణాఫ్రికాకు వెళ్తే తనను అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో ఆయన తన పర్యటనను విరమించుకున్నారు.
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకున్నారు. దేశం దాటి దక్షిణాఫ్రికాకు వెళ్తే తనను అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో ఆయన తన పర్యటనను విరమించుకున్నారు. దాంతో అధ్యక్షుడు పుతిన్‌కు బదులుగా రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా తరఫున బ్రిక్స్ సదస్సులో పాల్గొననున్నారు.
ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ICC) ఈ ఏడాది మార్చి నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీచేసింది. దాంతో పుతిన్ తన దేశం దాటి వస్తే అరెస్టయ్యే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో వచ్చే ఆగస్టు నెలలో దక్షిణాఫ్రికాలో జరుగనున్న బ్రిక్స్ దేశాల 15వ సదస్సుకు హాజరుకావాల్సి ఉన్న ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
తనకు బదులుగా తన విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ను దక్షిణాఫ్రికాకు పంపనున్నట్లు తెలిపారు. ఇదిలావుంటే వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ దేశాల 15వ సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులందరూ హాజరుకానున్నారు. కాగా, ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసినట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

