Russia gas station | రష్యాలో గ్యాస్ స్టేషన్ పేలుడు.. 35కు చేరిన మృతుల సంఖ్య
Russia gas station | రష్యా (Russia)లోని మఖచ్కాలాలో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ స్టేషన్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల్లో కొందరు ప్రాణాలు కోల్పోవడంతో ఇవాళ మధ్యాహ్నం వరకు మొత్తం మృతుల సంఖ్య 35కు పెరిగింది.
మాస్కో: రష్యా (Russia)లోని మఖచ్కాలాలో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ స్టేషన్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల్లో కొందరు ప్రాణాలు కోల్పోవడంతో ఇవాళ మధ్యాహ్నం వరకు మొత్తం మృతుల సంఖ్య 35కు పెరిగింది. మరో 102 మంది గాయాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. మంగళవారం ఉదయం 6.00 గంటల సమయంలో పేలుడు సంభవించిందని డగెస్టాన్ రీజియన్ హెడ్ సెర్గీ మెలికోవ్ తెలిపారు.
గ్యాస్ స్టేషన్ పేలుడుకు ముందే దానికి ఎదురుగా ఉన్న కార్ల సర్వీసింగ్ సెంటర్లో పేలుడు సంభవించిందని, ఆ మంటలు చుట్టూ 600 మీటర్ల పరిధి వరకు విస్తరించాయని, ఆ క్రమంలోనే గ్యాస్ స్టేషన్‌కు మంటలు అంటుకుని ఇంధన ట్యాంకులు పేలిపోయాయని మెలికోవ్ చెప్పారు. గ్యాస్ స్టేషన్‌లోని మొత్తం 8 ఇంధన ట్యాంకుల్లో 2 ట్యాంకులు పేలిపోయాయన్నారు. హీట్ కారణంగా మళ్లీ పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉండటంతో స్థానికులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
6 నెలల్లో 23 మరణశిక్షలు.. జడ్జి బదిలీ
సామాన్యుడిపై మరో పిడుగు.. పెరగనున్న సబ్బులు, వంటనూనెల ధరలు
Congress | ‘పట్టభద్రుల’ భయంలో కాంగ్రెస్ సర్కార్.. హైదరాబాద్‌లో నిరసన రద్దు.. ఢిల్లీకి పరుగు
KTR | కేటీఆర్‌తో యువ న్యాయవాదుల భేటీ.. సామాన్యులకు న్యాయం కోసం నిబద్ధతతో పనిచేయాలని లాయర్లకు పిలుపు
Tummidihatti Barrage | ‘తమ్మిడిహట్టి’పై ‘మహా’ సస్పెన్స్.. 152 మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్ ఓకే చెప్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

