న్యూఢిల్లీ, జనవరి 6: పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ పిల్లి మనలో చాలా మంది కంటే అత్యంత సంపన్నురాలని మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన పెంపుడు జంతువుల్లో ఇది మూడోస్థానంలో ఉన్నది. దీని పేరు ఒలివియా బెన్సన్. ఈ పిల్లి ఆస్తి అక్షరాలా రూ.800 కోట్లు.
తన యజమానితో పాటు పలు మ్యూజిక్ వీడియోల్లో కనిపించిన బెన్సన్.. బిగ్బడ్జెట్ యాడ్లలోనూ దర్శనమిచ్చింది. ఇన్స్టాలో దీనికి 97 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. 100 మిలియన్ డాలర్ల ఆస్తితో నాలా క్యాట్ అనే పిల్లి రెండో స్థానంలో ఉండగా, 500 మిలియన్ డాలర్ల సంపదతో ఓ శునకం మొదటిస్థానంలో ఉన్నది.