Watch: విమానం గాల్లో ఎగురుతుండగా… వ్యక్తి హంగామా, విండో బ్రేక్ చేసేందుకు యత్నం
అతడి తీరుపై విమానంలోని మిగతా ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఇతర ప్రయాణికులకు ఎలాంటి హాని కలుగకుండా ఉండేందుకు నిబంధనల మేరకు ఫ్లైట్ సిబ్బంది ఆ వ్యక్తిని ఒక సీటుకు కట్టేశారు.
ఇస్లామాబాద్: విమానం గాల్లో ఎగురుతుండగా ఒక ప్రయాణికుడు హంగామా చేశాడు. ఫ్లైట్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు విమానం సీట్లు, విండోను పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) విమానంలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 14న పీకే-283 విమానం పాకిస్థాన్‌లోని పెషావర్ నుంచి దుబాయ్‌కు టేకాఫ్ అయ్యింది. అయితే ఆ విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు. విమానం మధ్యలో ఉన్న దారిలో బోర్లా పడుకున్నాడు. గమనించిన విమాన సిబ్బంది అతడ్ని పైకి లేపి సీటులో కూర్చోవాలని సూచించారు.
కాగా, ఆ వ్యక్తి ఫ్లైట్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. సీట్లను చేతితో పంచ్ చేశాడు. విమానం కిటికీ అద్దాన్ని కాళ్లతో గట్టిగా కొట్టి పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడి తీరుపై విమానంలోని మిగతా ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఇతర ప్రయాణికులకు ఎలాంటి హాని కలుగకుండా ఉండేందుకు నిబంధనల మేరకు ఫ్లైట్ సిబ్బంది ఆ వ్యక్తిని ఒక సీటుకు కట్టేశారు.
అనంతరం ఫ్లైట్ కెప్టెన్ దుబాయ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ను సంప్రదించారు. విమానంలో ఒక ప్రయాణికుడి హంగామా, దురుసు ప్రవర్తనను వివరించారు. తమ విమానం వద్దకు సెక్యూరిటీని పంపాలని కోరారు. దీంతో ఆ విమానం దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రయాణికుడ్ని కస్టడీలోకి తీసుకున్నారు. మరోవైపు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) సంస్థ ఆ ప్రయాణికుడ్ని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది.
#Video A passenger created extreme trouble on a Pakistan International Airlines (PIA) Peshawar-Dubai PK-283 flight as he suddenly started punching seats and kicking the aircraft’s window. pic.twitter.com/bUZ0ZTVNxw
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) September 19, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

