పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.262.80కు చేరిన డీజిల్ రేటు..!
Petro Rates Hike | పొరుగు దేశం పాకిస్థాన్‌లో పెట్రో ధరలు భగ్గుమన్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.35 చొప్పున ధరలు పెంచేసింది. పెంచిన ధరలు ఇవాళ (జనవరి 29) ఉదయం 11 గంటల నుంచి అమల్లోకి వచ్చాయని పాకిస్థాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ ఇవాళ ఉదయం టీవీలో ప్రసంగిస్తూ ప్రకటించారు.
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్థాన్‌లో పెట్రో ధరలు భగ్గుమన్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.35 చొప్పున ధరలు పెంచేసింది. పెంచిన ధరలు ఇవాళ (జనవరి 29) ఉదయం 11 గంటల నుంచి అమల్లోకి వచ్చాయని పాకిస్థాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ ఇవాళ ఉదయం టీవీలో ప్రసంగిస్తూ ప్రకటించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్‌కు చెందిన డాన్ పత్రిక తన కథనంలో పేర్కొన్నది.
అదేవిధంగా కిరోసిన్ ఆయిల్, లైట్ డీజిల్ ఆయిల్ ధరలను కూడా లీటర్‌కు రూ.18 చొప్పున పెంచినట్లు ఇషాక్ దార్ తెలిపారు. మొత్తం నాలుగు రకాల పెట్రోలియం ఉత్పత్తులను ధరలను పెంచినట్లు ఆయన వెల్లడించారు. పెరిగిన ధరలతో కలిపి పాకిస్థాన్‌లో లీటర్ హైస్పీడ్ డీజిల్ ధర రూ.262.80కు చేరింది. అదేవిధంగా లీటర్ పెట్రోల్ ధర రూ.249.80కు పెరిగింది.
ఇక లీటర్ కిరోసిన్ ఆయిల్ ధర రూ.189.83కు, లీటర్ లైట్ డీజిల్ ధర రూ.187కు చేరింది. పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ సూచన మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. గత వారం రోజులుగా అమెరికన్ డాలర్లో పోల్చితే పాకిస్థాన్ రూపీ 11 శాతం పతనమయ్యిందని, దాంతో అంతర్జాతీయ మార్కెట్ నుంచి పెట్రో దిగుమతుల భారం పెరిగిందని, అందుకే పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచక తప్పలేదని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

