Stampede | యెమెన్లో తొక్కిసలాట.. 85 మంది మృతి, 322 మందికిపైగా గాయాలు
అరేబియన్ దేశాల్లో ఒకటైన యెమెన్ (Yemen) రాజధాని సనాలో విషాదం చోటుచేసుకున్నది. రంజాన్ (Ramadan) సందర్భంగా సనాలో (Sanaa) ఏర్పాటుచేసిన ఆర్థిక సాయం పంపిణీ (Charity distribution) కార్యక్రమంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. దీంతో 85 మందికిపైగా మరణించారు. 322 మందికిపైగా గాయపడ్డారు.
సనా: అరేబియన్ దేశాల్లో ఒకటైన యెమెన్ (Yemen) రాజధాని సనాలో విషాదం చోటుచేసుకున్నది. రంజాన్ (Ramadan) సందర్భంగా సనాలో (Sanaa) ఏర్పాటుచేసిన ఆర్థిక సాయం పంపిణీ (Charity distribution) కార్యక్రమంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. దీంతో 85 మందికిపైగా మరణించారు. 322 మందికిపైగా గాయపడ్డారు.
ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ సందర్భంగా సనాలోని బాల్ అల్-యెమెన్ (Bab al-Yemen) ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తున్నది. దీంతో ఆర్థిక సాయం కోసం ప్రజలు పెద్దసంఖ్యలో ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఒకరినొకరు తోసుకోవడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. అదికాస్త తొక్కిసలాటకు దారితీయడంతో 85 మందికిపైగా మరణించారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నాయని హుతి సెక్యూరిటీ ఆఫీసర్ ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో 322 మందికిపైగా గాయపడ్డారని, వారందరిని సమీపంలోని దవాఖానలకు తరించామన్నారు. నిర్వాహకుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
పెద్దసంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోవడంతో వారి సంబంధీకులు భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో సైన్యం ఆ ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నదని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా, మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదని హుతి అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు. కొందరు వ్యాపారులు ప్రజలకు ఆర్థిక సాయం చేయడానికి ఈ కార్యక్రామన్ని ఏర్పాటు చేశారన్నారు. గత నెల రోజుల్లో పాకిస్థాన్లో కూడా ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పంజాబ్ ప్రావిన్స్, కరాచీల్లో ఉచిత పిండి పంపిణీ, నిత్యావసరాల పంపిణీ జరిగిన తొక్కిసలాటల్లో సుమారు 40 మంది చనిపోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

