Adani | కెన్యాలో అదానీకి ఎదురుదెబ్బ.. ఒప్పందం రద్దు చేసిన ప్రభుత్వం
నైరోబీ ఎయిర్‌పోర్టు విస్తరణ, నిర్వహణ కోసం అదానీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కెన్యా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కెన్యా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(కేఏఏ)ని కెన్యా జాతీయ అసెంబ్లీ ప్రజా పెట్టుబడుల కమిటీ ఆదేశించింది. టెండరు ప్రక్రియపై ప్రత్యేక ఆడిట్ జరిపే వరకు అదానీ గ్రూప్‌తో తదుపరి ప్రక్రియలను నిలిపివేయాలని సూచించింది.
- నైరోబీ విమానాశ్రయ విస్తరణకు అగ్రిమెంట్
- వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కార్మికుల ఆందోళన
- నిరసనలతో తలొగ్గి ఒప్పందం రద్దు చేసిన కెన్యా
Adani | నైరోబి: నైరోబీ ఎయిర్‌పోర్టు విస్తరణ, నిర్వహణ కోసం అదానీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కెన్యా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కెన్యా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(కేఏఏ)ని కెన్యా జాతీయ అసెంబ్లీ ప్రజా పెట్టుబడుల కమిటీ ఆదేశించింది. టెండరు ప్రక్రియపై ప్రత్యేక ఆడిట్ జరిపే వరకు అదానీ గ్రూప్‌తో తదుపరి ప్రక్రియలను నిలిపివేయాలని సూచించింది.
కెన్యా రాజధాని నైరోబీలోని జోమో కెన్యట్ట అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు(జేకేఐఏ) ఆధునికీకరణ, 30 ఏండ్ల పాటు నిర్వహణ కోసం అదానీ సంస్థ కెన్యా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఎయిర్‌పోర్టు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
దీంతో ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు సైతం స్తంభించాయి. పలువురు కెన్యా జాతీయ అసెంబ్లీ సభ్యులు సైతం ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అదానీ కంటే ఏఎల్జీ అనే స్థానిక సంస్థ మరింత మెరుగైన ప్రతిపాదన చేసినప్పటికీ అదానీకే ఎయిర్‌పోర్టును అప్పగించాలనే నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ప్రజా పెట్టుబడుల కమిటీ ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆదేశించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

