ఒమిక్రాన్‌తో పిల్లల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు.. తేల్చిన కొత్త స్టడీ
వాషింగ్టన్: ఒమిక్రాన్ కరోనా వేయింట్ వల్ల చిన్నారుల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు సోకుతున్నట్లు కొత్త అధ్యయనంలో తేల్చారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల పిల్లలు గుండెపోటు లేదా ఇతర తీవ్ర సమస్యల్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ, స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ పరిశోధకులు సుమారు 18849 మంది చిన్నారులపై స్టడీ చేశారు. ఆ పిల్లలంతా 19 ఏండ్ల లోపువారే. జామా పిడియాట్రిక్స్ జర్నల్‌లో దీనిపై రిపోర్ట్‌ను ప్రచురించారు. ఒమిక్రాన్ వల్ల యువ పిల్లల్లో యూఏఏ వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు. అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు పిల్లల్లో యూఏఐ(అప్పర్ ఎయిర్‌వే ఇన్ఫెక్షన్స్) కేసులు అధికంగా నమోదు అయినట్లు తేలింది.
కోవిడ్ వల్ల హాస్పిటళ్లలో చేరిన 21.1 శాతం మంది పిల్లల్లో తీవ్రమైన యూఏఐ కేసులు నమోదు అయినట్లు తేల్చారు. ఆ పిల్లల బ్రీతింగ్ కోసం ఊపిరితిత్తులకు ట్యూబ్‌లను ఎక్కించినట్లు తెలిపారు. ఇంటుబేషన్ అనే పద్ధతిలో చికిత్స ఇచ్చినట్లు పరిశోధకులు వెల్లడించారు. తీవ్రమైన యూఏఐ వ్యాధి సోకిన వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఉందని, ఎందుకంటే శ్వాస నాళాలు అకస్మాత్తుగా మూసుకుపోతాయని, దాని వల్ల గుండెకు శ్వాస అందకపోవచ్చు అన్నారు. ఆ సమయంలో ఇంటుబేషన్ చికిత్సలో భాగంగా రెసిమిక్ ఎపినీఫ్రైన్, హీలియం-ఆక్సిజన్ మిక్సర్ లాంటి పలు థెరపీలు చేయాల్సి ఉంటుందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

