Turkey Earthquake: ఇంక్యుబేటర్లలో శిశువులు.. నర్సులు ఏం చేశారో చూడండి.. వీడియో
Turkey Earthquake:ఇంక్యుబేటర్లలో ఉన్న నవజాత శిశువుల్ని రక్షించేందుకు తుర్కియే ఆస్పత్రుల్లో నర్సులు సాహసం చేశారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా.. పిల్లల్ని కాపాడేందుకు ప్రయత్నించారు.
అంకారా: భారీ భూకంపం ధాటికి తుర్కియే వణికిపోయిన విషయం తెలిసిందే. ఆ భూకంపం వల్ల మృతిచెందిన వారి సంఖ్య ప్రస్తుతం 35వేలు దాటింది. తుర్కియేలోని గజియాన్టెప్ ప్రాంతం కేంద్రంగా భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాంతంలో ఉన్న ఓ నవజాత శిశువుల ఆస్పత్రిలో .. పిల్లల్ని కాపాడేందుకు అక్కడి నర్సులు చాలా సాహసమే చేశారు. దానికి సంబంధించిన వీడియోను ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ఫారెట్టిన్ కోకా తన ట్విట్టర్లో షేర్ చేశారు.
O can alıcı sarsıntı sırasında iki hemşire arkadaşımız unutulmaz bir davranış gösterdi. Gaziantep İnayet Topçuoğlu Hastanesi Yeni Doğan Yoğun Bakım Ünitesinde görevli Devlet ve Gazel hemşireler dışarı çıkmak yerine bebeklerin bulunduğu kuvözlerin devrilmesini önlemeye çalıştılar. pic.twitter.com/ikCoqqpU9M
— Dr. Fahrettin Koca (@drfahrettinkoca) February 12, 2023
భూకంప ప్రభావం వల్ల ఆస్పత్రి ఊగిపోయింది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న నర్సులు .. ఇంక్యుబేటర్లలో ఉన్న శిశువుల్ని కాపాడేందుకు తమ ప్రాణాలను అడ్డువేశారు. భూమి ఊగిపోతున్న సమయంలో.. ఇంక్యుబేటర్లు ఉన్న రూమ్‌లోకి పరుగెత్తుకు వచ్చి వాటిని పట్టుకున్నారు. ప్రాణాలకు తెగించి మరీ నర్సులు.. ఆ చిన్నారుల ఇంక్యుబేటర్లను కింద పడకుండా చూసుకున్నారు. గజియాన్‌టెప్‌లోని ఇనాయత్ టాప్కోగు ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియోను మంత్రి పోస్టు చేశారు.
Gaziantep İnayet Topçuoğlu Hastanesinde görevli arkadaşlarımız deprem anında canları pahasına hasta çocuklarımızı kurtardı. Bunun başka hastanelerimizde de çok örneği var. Daha ilk anda deprem illerine koşmaya başlayan insanlarımız da aynı şeyi yaptı. pic.twitter.com/4R7vsAH2y7
— Dr. Fahrettin Koca (@drfahrettinkoca) February 12, 2023
మరో వీడియోలోనూ ఆస్పత్రి సిబ్బంది.. వార్డుల్లో ఉన్న పిల్లల్ని రక్షించేందుకు ప్రయత్నించారు. వివిధ వార్డుల్లో ఉన్న శిశువులను కాపాడేందుకు వాళ్లు అన్ని రూమ్‌ల్లోకి పరుగులు పెట్టారు. ప్రతి ఆస్పత్రిలోనూ ఇలాంటి సన్నివేశాలే కనిపించాయని మంత్రి పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

