Indian Student Jahnavi | జాహ్నవి మృతిపై పోలీస్ అధికారి ఎగతాళి వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన అమెరికా మేయర్
Indian Student Jahnavi | అమెరికాలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టడంతో భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల మృతిచెందడం, ఆమె మరణంపై ఓ పోలీస్ అధికారి ఎగతాళిగా మాట్లాడటంపై సీటెల్ మేయర్ బ్రూస్ హారెల్ క్షమాపణ కోరారు.
వాషింగ్టన్: అమెరికాలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టడంతో భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల మృతిచెందడం, ఆమె మరణంపై ఓ పోలీస్ అధికారి ఎగతాళిగా మాట్లాడటంపై సీటెల్ మేయర్ బ్రూస్ హారెల్ క్షమాపణ కోరారు. జాహ్నవి మృతి గురించి పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో మేయర్ స్పందించారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల ఈ ఏడాది జనవరిలో రోడ్డు దాటుతుండగా పోలీస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 23 ఏండ్ల జాహ్నవి అక్కడికక్కడే మరణించింది. నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలోని సీటెల్ క్యాంపస్‌లో మాస్టర్స్ ఢిగ్రీ చదువుతున్న భారతీయ విద్యార్థిని మరణం పట్ల ఒక పోలీస్ అధికారి చాలా చులకనగా, హేళనగా మాట్లాడాడు. ఆమె ప్రాణాలకు విలువలేదని సీటెల్ పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్ తన సహోద్యోగితో అన్నాడు. డేనియల్ నవ్వుతూ.. ‘ఆమె చనిపోయింది. సాధారణ వ్యక్తి’ అని తెలిపాడు. అలాగే మళ్లీ నవ్వుతూ.. ‘ఒక చెక్ రాయండి పదకొండు వేల డాలర్లకు’ అని చెప్పాడు. ఆమె వయసు 26 ఏండ్లని, ఆమె ప్రాణాలకు విలువ లేదని నవ్వుతూ అన్నాడు.
కాగా, పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్ మరో పోలీస్ అధికారితో ఫోన్లో మాట్లాడిన ఈ సంభాషణ అతడి బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఆడియో క్లిప్‌ను సీటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. అది వైరల్ కావడంతో పోలీస్ అధికారి డేనియల్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనపై కొందరు నిరసన వ్యక్తం చేశారు. ఆ పోలీస్ అధికారిపై చర్యలకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు సీటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఈ క్రమంలోనే సీటెల్ మేయర్ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

