తొలి ఫత్వా : యూనివర్సిటీల్లో కో-ఎడ్యుకేషన్‌కు తాలిబన్ల చెక్!

కాబూల్ : ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీల్లో కో-ఎడ్యుకేషన్ పద్ధతికి స్వస్తి పలకాలని ఆప్ఘనిస్ధాన్లోని హెరత్ ప్రావియన్స్‌లో తాలిబన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒకే క్లాసులో విద్యార్ధులతో కలిసి విద్యార్ధినులు కూర్చునేందుకు అనుమతించరాదని తాలిబన్లు తొలి ఫత్వా జారీ చేశారు. యూనివర్సిటీ లెక్చరర్లు, ప్రైవేట్ విద్యాసంస్ధల యజమానులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కో ఎడ్యుకేషన్‌ను అనుమతించరాదని ఈ విధానాన్ని నిలిపివేయాలని తాలిబన్ అధికారులు స్పష్టం చేశారు.
ప్రభుత్వ యూనివర్సిటీలు, విద్యా సంస్ధల్లో విద్యార్ధినీ, విద్యార్ధులకు వేర్వేరుగా తరగతులు నిర్వహించే వెసులుబాటు ఉంటుందని, ప్రైవేట్ విద్యాసంస్ధల్లో విద్యార్ధినుల సంఖ్య తక్కువగా ఉండటంతో వారికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించడం ఆయా సంస్ధలకు భారమవుతుందని లెక్చరర్లు అభిప్రాయపడ్డారు. అయితే సమాజంలో అన్ని అనర్ధాలకు కారణమైన కో ఎడ్యుకేషన్ వ్యవస్ధను రద్దు చేయాలని తాలిబన్ల వాదన వినిపించేందుకు ఈ సమావేశానికి హాజరైన ఆప్ఘనిస్ధాన్ ఇస్లామిక్ ఎమిరేట్, ఉన్నత విద్య చీఫ్ ముల్లా ఫరీద్ స్పష్టం చేశారు.
విద్యార్ధినులకు మహిళా లెక్చరర్లు, వయసు మీరిన లెక్చరర్లతో బోధన సాగించాలని సూచించారు. ప్రైవేట్ విద్యా సంస్ధలు, విద్యార్ధినీ..విద్యార్ధులకు వేర్వేరుగా తరగతులు నిర్వహించే ఆర్ధిక వెసులుబాటు లేనందున తాలిబన్ల తాజా నిర్ణయంతో వేలాది బాలికలు, యువతులు ఉన్నత విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని హెరత్ ప్రాంత లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

