న్యూయార్క్: ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికాలో ప్రస్తుతం ప్రైమరీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిపబ్లికన్ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ పార్టీ నుంచి దూసుకెళ్తున్నారు. అయితే ఆ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఉన్న నిక్కీ హేలీ(Nikki Haley).. ఆ పోటీ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మార్చి 5వ తేదీన జరిగిన సూపర్ ట్యూజ్‌డే రేసులో ట్రంప్ దాదాపు అన్ని రాష్ట్రాల్లో విక్టరీ కొట్టారు. అయితే వెర్మౌంట్ రాష్ట్రంలో మాత్రం నిక్కీ హేలీ విజయం సాధించారు. కానీ ట్రంప్‌తో పోటీపడలేకపోతున్న నిక్కీ హేలీ.. ఆ రేసు నుంచి తప్పుకోనున్నట్లు కొన్ని వార్తా సంస్థల ద్వారా తెలుస్తోంది. దక్షిణ కరోలినా గవర్నర్‌గా చేసిన నిక్కీ హేలీ.. ఈ రేసులో ట్రంప్‌ను ఓడించేందుకు చాలా ప్రయ్నతించారు. కానీ బలమైన బేస్ ఉన్న ట్రంప్‌ను ఆమె ఏమీ చేయలేకపోయారు.