కొత్త బ్లడ్ గ్రూప్ ‘ఈఆర్’
యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు అరుదైన కొత్త రక్తవర్గాన్ని కనుగొన్నారు. దీనికి ‘ఈఆర్'గా నామకరణం చేశారు. ఈ కొత్త బ్లడ్‌గ్రూప్ ఆవిష్కరణ ప్రమాదకర పరిస్థితుల నుంచి ప్రాణాలు కాపాడేందుకు తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
- కనుగొన్న యూకే శాస్త్రవేత్తలు
- ఈ గ్రూప్ ఉంటే గర్భంలోనే శిశువు మృతి చెందే ప్రమాదం
లండన్: యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు అరుదైన కొత్త రక్తవర్గాన్ని కనుగొన్నారు. దీనికి ‘ఈఆర్’గా నామకరణం చేశారు. ఈ కొత్త బ్లడ్‌గ్రూప్ ఆవిష్కరణ ప్రమాదకర పరిస్థితుల నుంచి ప్రాణాలు కాపాడేందుకు తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. రక్తంలోని ప్రొటీన్స్ ఆధారంగా బ్లడ్ గ్రూప్‌లను నిర్ధారిస్తారు. ఎర్రరక్త కణాల ఉపరితలంలో ఈ ప్రొటీన్స్ కనిపిస్తాయి. ఏ,బీ,ఏబీ, ఓ.. ఇప్పటివరకూ ఉన్న సాధారణ బ్లడ్ గ్రూప్‌లు. తాజాగా వీటికి ‘ఈఆర్’ జతచేరనుంది.
30 ఏండ్ల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు
‘ఈఆర్’ను కనుగొనడం ద్వారా పరిశోధకులు 30 ఏండ్ల మిస్టరీ ఛేదించారు. బ్లడ్ గ్రూప్‌లకు సంబంధించి రెండు కేసులు శాస్త్రవేత్తల వద్దకు వచ్చాయి. రక్తంలో సమస్య వల్ల ఇద్దరు మహిళల గర్భంలో శిశువులు మృతిచెందారు. దీనిపై అధ్యయనం జరిపిన శాస్త్రవేత్తలు వారి బ్లడ్‌గ్రూప్ ‘ఈఆర్’గా తేల్చారు. ఈఆర్ గురించి ప్రస్తావించిన 30 ఏండ్ల కిందటి అధ్యయనాన్ని పరిశీలించారు. శరీరంలో ఒకే బ్లడ్‌గ్రూప్ లేకుంటే తీవ్ర సమస్యలు లేదా మరణం సంభవిస్తుందని కనుగొన్నారు. తల్లి, శిశువు రక్త వర్గాలు వేరుగా ఉన్నప్పుడు తల్లి రోగనిరోధకశక్తి తీవ్రమైన రియాక్షన్స్‌కు కారణమవుతుందని గుర్తించారు. ‘తల్లి బ్లడ్ గ్రూప్ ‘ఈఆర్’ అయితే.. ఆమె రోగనిరోధక వ్యవస్థ శిశువు రక్తానికి వ్యతిరేకంగా యాంటిబాడీలను తయారుచేస్తుంది. ఈ యాంటిబాడీలు మావి ద్వారా శిశువుకు చేరుకుంటాయి. వారిలో హిమోలిటిక్ వ్యాధిని కలిగిస్తాయి. గుండె వైఫల్యంతో శిశువు గర్భంలోనే మరణిస్తాడు’ అని తేల్చారు. ఈ పరిశోధన ‘ఈఆర్’ బ్లడ్ గ్రూప్‌ను కనుగొనేందుకు, అది కలిగించే సమస్యలను నివారించేందుకు మార్గాలను సుగమం చేసిందని పరిశోధకులు తెలిపారు. ‘ఈఆర్’ బ్లడ్ గ్రూప్‌ను గుర్తించే సులభమైన పద్ధతిని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

