టెక్సాస్: విశాల ఆకాశంలో మెరిసిపోతున్న నెలవంక తాజా చిత్రాలను నాసా రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 30వ తేదీన ఆ చందమామ ఫోటోలను అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ తీసింది. అట్లాంటిక్ సముద్రం మీద సుమారు 429 కిలోమీటర్ల ఎత్తులో స్పేస్ స్టేషన్ ప్రయాణిస్తున్న సమయంలో ఈ చిత్రాన్ని తీసినట్లు నాసా చెప్పింది. నాసా రిలీజ్ చేసిన ఫోటోలో నెలవంకతో పాటు కొన్ని రంగుల పొరలు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆ రంగు రంగుల పొరలు.. వివిధ వాతావరణ పొరలుగా నాసా పేర్కొన్నది.
నెలవంక ఎంత అందంగా ఉందో.. అలాగే వివిధ స్థాయిల్లో వాతావరణం కూడా కలర్ఫుల్గా కనిపించింది. ఈ ఫోటోలో దిగువన ఉన్న ఆరెంజ్ రంగు ట్రోపోస్పియర్గా నాసా వెల్లడించింది. ఈ లేయర్లో మనం పీల్చే గాలి, మబ్బులు ఉంటాయి. ఇక తెలుపు రంగు.. స్ట్రాటోస్పియర్ను సూచిస్తున్నట్లు అమెరికా స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. 35 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ వాతావరణంలోనే ఓజోన్ పొర ఉంటుంది. ఇదే మనల్ని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తున్న విషయం తెలిసిందే.
లైట్ బ్లూ కలర్లో ఉన్న వాతావరణాన్ని మియోస్పియర్ అంటారు. ఆ తర్వాత చీకటి అంతరిక్ష ప్రదేశం కనిపిస్తుంది. మియోస్పియర్లోనే తోకచుక్కలు కాలిపోతుంటాయి. ఇక్కడ ఎక్కవ సంఖ్యలో వాయువులు ఉంటాయని, అవి వేడిని పుట్టిస్తాయని నాసా తెలిపింది.