Mosquitoes | హెలికాప్టర్లలో దోమలను తీసుకెళ్లి వదులుతున్న హవాయి సర్కారు.. ఎందుకంటే..!
Mosquitoes | అమెరికాలోని హవాయి రాష్ట్రంలో మగదోమలను హెలికాప్టర్లలో తీసుకెళ్లి గాల్లో వదులుతున్నారు. దోమలను తీసుకెళ్లి గాల్లో వదలడం దేనికి అనుకుంటున్నారా..? ఇలా దోమలను వదలడం వల్ల ప్రయోజనం ఏమిటి..? అని ఆలోచిస్తున్నారా..? ప్రత్యేకంగా మగ దోమలనే ఎందుకు వదులుతున్నారనే సందేహం మీ మదిలో మెదులుతోందా..? అయితే మీరు దీనిగురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.
Mosquitoes : అమెరికాలోని హవాయి రాష్ట్రంలో మగదోమలను హెలికాప్టర్లలో తీసుకెళ్లి గాల్లో వదులుతున్నారు. దోమలను తీసుకెళ్లి గాల్లో వదలడం దేనికి అనుకుంటున్నారా..? ఇలా దోమలను వదలడం వల్ల ప్రయోజనం ఏమిటి..? అని ఆలోచిస్తున్నారా..? ప్రత్యేకంగా మగ దోమలనే ఎందుకు వదులుతున్నారనే సందేహం మీ మదిలో మెదులుతోందా..? అయితే మీరు దీనిగురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.
హవాయి రాష్ట్రంలో కొన్ని అరుదైన పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు ఆ రాష్ట్ర పాలనా యంత్రాంగం వినూత్న చర్యలు చేపట్టింది. బ్యాక్టీరియాతో కూడిన లక్షలాది ప్రత్యేక దోమలను హెలికాప్టర్లలో పైకి తీసుకెళ్లి వదిలిపెడుతోంది. ఇలా ఇప్పటికే కోటి దోమలను వదిలింది. అందమైన హవాయి దీవుల్లో ఇప్పటికే 33 రకాల పక్షి జాతులు అంతరించిపోయాయని స్థానిక ప్రభుత్వం గుర్తించింది. మరో 17 రకాల పక్షి జాతులు ముప్పును ఎదుర్కొంటున్నాయి. వాటిలో కొన్ని మరో ఏడాదిలోనే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
‘అకికికి’ అనే పక్షుల సంఖ్య 2018లో 450 ఉండగా, 2023 నాటికి ఐదుకు పడిపోయింది. ఇప్పుడు ఒకటి మాత్రమే మిగిలి ఉందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిణామాలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో హవాయి ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. అందుకోసం భారీ స్థాయిలో దోమలను హెలికాప్టర్ల సాయంతో విడుదల చేస్తోంది. ఇలా ప్రతివారం హెలికాప్లర్ల ద్వారా 2.5 లక్షల మగ దోమలను తీసుకువస్తున్నారు. ఇప్పటివరకు కోటి దోమలను వివిధ ప్రదేశాల్లో విడిచిపెట్టారు.
హవాయిలో మాత్రమే కనిపించే కొన్ని అరుదైన పక్షిజాతులు మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నాయి. వ్యాధికారక దోమ కుడితే 90 శాతం అవి చనిపోయే ప్రమాదం ఉంది. మలేరియాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఆ పక్షులకు లేకపోవడమే అందుకు కారణం. అందుకు పరిష్కారం కోసం ఒల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడిన మగదోమలను ఉత్పత్తి చేసి హెలికాప్టర్లతో వదులుతున్నారు. ఈ మగదోమలను కలిసిన ఆడ దోమలను గుడ్లు పొదగవు. దాంతో ఉత్పత్తి జరగదు. అలా క్రమంగా దోమల సంఖ్య తగ్గిపోతుందనే ఉద్దేశంతో హవాయి సర్కారు ఈ వినూత్న చర్యలు చేపట్టింది.
దీన్ని ఇనకంపాటబుల్ ఇన్సెక్ట్ టెక్నిక్‌గా వ్యవహరిస్తారట. ఆమెరికా నేషనల్ పార్క్ సర్వీస్ సాయంతో హవాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. చైనా, మెక్సికోలో దోమల సంఖ్యను తగ్గించేందుకు ఇదే విధానాన్ని అనుసరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

