Milk Goddess | ఆమెలో ధారగా తల్లిపాలు.. మూడేళ్లలో 1600 లీటర్ల పాలు దానం.. అత్యధిక తల్లిపాల దాతగా గిన్నిస్ రికార్డు
Milk Goddess | పసిబిడ్డల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో తల్లిపాలకు ఎంత ప్రాముఖ్యం ఉంటుందో మనందరికీ తెలుసు..! పసితనంలో తల్లిపాలు సరిగా లభ్యం కాని వాళ్లు పెరిగిపెద్దయ్యాక బలహీనంగా ఉంటారని చెబుతుంటారు..! అయితే, కొందరు తల్లులు తమ అందం పోతుందని బిడ్డలకు పెట్టుడు పాలు అలవాటు చేస్తుంటారు..! మరి కొందరేమో ఇద్దామన్నా సరిపడా తల్లిపాలు రాక పెట్టుడు పాలు తాపుతుంటారు..!
ఓరెగాన్: పసిబిడ్డల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో తల్లిపాలకు ఎంత ప్రాముఖ్యం ఉంటుందో మనందరికీ తెలుసు..! పసితనంలో తల్లిపాలు సరిగా లభ్యం కాని వాళ్లు పెరిగిపెద్దయ్యాక బలహీనంగా ఉంటారని చెబుతుంటారు..! అయితే, కొందరు తల్లులు తమ అందం పోతుందని బిడ్డలకు పెట్టుడు పాలు అలవాటు చేస్తుంటారు..! మరి కొందరేమో ఇద్దామన్నా సరిపడా తల్లిపాలు రాక పెట్టుడు పాలు తాపుతుంటారు..! కానీ ఆమెరికాకు చెందిన ఓ మహిళ దగ్గర మాత్రం తల్లిపాలకు కొదవ లేదు..! ఆమె పాలు ఒకరో ఇద్దరో, లేదంటే వందా రెండు వందల మందో కాదు.. ఏకంగా వేల మంది పిల్లల ఆకలి తీరుస్తున్నాయి..! ‘కేవలం ఒక్క మహిళ పాలు వేల మంది పిల్లలకు సరిపోవడం ఏంటి..?’ అని ఆశ్చర్యపోతున్నారా..? కానీ, ఇది నిజం..! కావాలంటే కింది వివరాలు చదవండి, విషయం మీకే అర్థమవుతుంది..!
ఎలిసబెత్ అండర్సన్.! ఈమె అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలోగల ది ఓలేహా పట్టణానికి చెందిన మహిళ..! ఈమెకు ముగ్గురు పిల్లలున్నారు..! పిల్లలు పెరిగి పెద్దవాళ్లయినా ఆమెలో పాల ధార మాత్రం ఆగిపోలేదు..! నిత్యం ఆమె నుంచి తల్లిపాలు ఓవర్ ఫ్లో అవుతూనే ఉన్నాయి..! ఆమెలో ఉన్న ఓ రుగ్మతనే అందుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు..! ఆ రుగ్మత పేరే హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్..! ఈ హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ కారణంగానే ఆమెలో నిర్విరామంగా పాల ఉత్పత్తి జరుగుతున్నది…!
పాల దేవత
అయితే, తనకు ఈ వింత రుగ్మత ఉన్నదని ఆమె ఏనాడు బాధపడలేదు. అంతేగాక ఆమెలో నిరంతరాయంగా ఉత్పత్తి అవుతున్న పాలను కూడా ఆమె వృథా చేయడంలేదు. ఆ పాలను ఆమెరికాలోని ఓ మిల్క్ బ్యాంకుకు దానం చేస్తున్నది. 2015 నుంచి 2018 వరకు కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలో ఆమె మొత్తం 1,599.68 లీటర్ల తల్లిపాలను దానం చేసింది. అందుకే ఆమెరికాలో ఆమెను ‘పాల దేవత’ అని కూడా పిలుచుకుంటున్నారు. కేవలం మూడేళ్లలో దాదాపు 1600 లీటర్ల పాలను దానం చేసి అత్యధిక తల్లిపాల దాతగా ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో కూడా చోటు సంపాదించింది.
ఈ విషయమై ఎలిసబెత్ అండర్సన్ సియెర్రాను పలుకరించగా.. తన శరీరంలో ప్రొలాక్టిన్ హార్మోన్ అవసరానికి మించి విడుదల అవుతున్నదని, ఇదే తనలో హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్కు కారణమైందని తెలిపింది. అయితే, తాను దానం చేస్తున్న పాలు అమెరికాలో నెలలు నిండకముందే జన్మించే కొన్ని వేల మంది పిల్లల ప్రాణాలు కాపాడుతుంటం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. వాస్తవానికి ఎలిసబెత్ పాలు తాగి ఎంతో మంది ప్రీ మెచ్యూర్ కిడ్స్ ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ విధంగా ఎంతో మంది ఆమెకు రుణపడి ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, అప్పుతో కలసి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

