మైక్రో, నానో ప్లాస్టిక్‌తో గుండెపోటు!
మైక్రో, నానో ప్లాస్టిక్ మనుషుల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారుతున్నాయి. శరీరంలోకి చేరుతున్న మైక్రో, నానో ప్లాస్టిక్ వల్ల గుండెపోటు, క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ఇటలీకి పరిశోధకులు గుర్తించారు.
లండన్: మైక్రో, నానో ప్లాస్టిక్ మనుషుల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారుతున్నాయి. శరీరంలోకి చేరుతున్న మైక్రో, నానో ప్లాస్టిక్ వల్ల గుండెపోటు, క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ఇటలీకి పరిశోధకులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి. కరోటిడ్ ఆర్టెరీల్లో(మెదడుకు రక్త సరఫరా చేసేందుకు మెడకు ఇరువైపులా ఉండే ధమనులు) నానో ప్లాస్టిక్స్ ఉన్న వారిలో గుండెపోటు వచ్చే ముప్పు ఇతరుల కంటే రెట్టింపు అవుతున్నట్టు వీరు తేల్చారు. కరోటిడ్ ఆర్టెరీలను చెడు కొలెస్ట్రాల్ బ్లాక్ చేసినట్టుగానే నానోప్లాస్టిక్స్ వల్ల కూడా జరుగుతుందని పేర్కొన్నారు.
కరోటిడ్ ఎండార్టెరెక్టోమీ చేసి తొలగించిన 257 మంది కరోటిడ్ అర్టెరీలపై అధ్యయనం జరిపిన పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. మనుషుల జబ్బులకు, ప్లాస్టిక్‌కు సంబంధముందని గుర్తించిన మొదటి అధ్యయనం ఇదేనని, గుండెసంబంధ సమస్యలకు ప్లాస్టిక్ కారణమని తమ అధ్యయనంలో గుర్తించినట్టు ప్రొఫెసర్ రఫేలె మార్ఫెల్లా తెలిపారు. 0.2 ఇంచుల నుంచి ఒక ఇంచులో 25,000వ వంతు వరకు పరిణామంలో ఉండే ప్లాస్టిక్ శకలాలను మైక్రో ప్లాస్టిక్‌గా పరిగణిస్తారు. ఇంతకంటే చిన్నగా ఉంటే ప్లాస్టిక్ శకలాలను నానో ప్లాస్టిక్‌గా పిలుస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

