Man Eats Wife’s Brain | భార్యను హత్య చేసి మెదడు తిన్న భర్త.. పుర్రెను యాష్ ట్రేగా వాడాడు
Man Eats Wife's Brain | ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఆపై ఘోరంగా ప్రవర్తించాడు. ఆమె మెదడును చపాతీలో పెట్టుకుని తిన్నాడు (Man Eats Wife's Brain). అలాగే ఆమె పుర్రెను యాష్ ట్రేగా వాడాడు. భార్య మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంచాడు.
మెక్సికన్ సిటీ: ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఆపై ఘోరంగా ప్రవర్తించాడు. ఆమె మెదడును చపాతీలో పెట్టుకుని తిన్నాడు (Man Eats Wife’s Brain). అలాగే ఆమె పుర్రెను యాష్ ట్రేగా వాడాడు. మెక్సికోలోని ప్యూబ్లోలో ఈ దారుణ సంఘటన జరిగింది. 32 ఏళ్ల అల్వారో అనే వ్యక్తి బిల్డర్. 38 ఏళ్ల మరియా మోంట్సెరాట్ను గత ఏడాది పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే 12 నుంచి 23 ఏళ్ల వయస్సున్న ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
కాగా, జూన్ 29న అల్వారో దారుణానికి పాల్పడ్డాడు. డ్రగ్స్ మత్తులో ఉన్న అతడు భార్యను హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. భార్య మెదడును చపాతీలో పెట్టుకుని తిన్నాడు. ఆమె పుర్రెను యాష్ ట్రేగా వినియోగించాడు. భార్య మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంచాడు. ఆ తర్వాత సవతి కుమార్తెకు ఫోన్ చేశాడు. వారి తల్లిని చంపి మృతదేహాన్ని బ్యాగ్లో ఉంచానని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పాడు.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ ఇంటికి వెళ్లి అల్వారోను అరెస్ట్ చేశారు. దెయ్యం ఆదేశించడంతో ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులకు అతడు చెప్పాడు. అలాగే భార్యను హత్య చేసిన నిందితుడి గదిలో చేతబడి ఆనవాళ్లు, బలిపీఠం వంటివి ఉండటాన్ని పోలీసులు గమనించారు.
కాగా, డ్రగ్స్ తీసుకునే అలవాటున్న అల్వారో సవతి కుమార్తెలను కూడా మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడని మృతురాలి తల్లి ఆరోపించింది. అతడు మానసిక రోగి కావచ్చని, అందుకే ఇలాంటి దారుణానికి పాల్పడి ఉంటాడని స్థానిక మీడియాకు ఆమె తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Ashtray
- Eats
- Mexican Man
- Mexico
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

