Los Angeles model | ఫ్రిజ్‌లో మోడల్ మృతదేహం.. రెండు నెలల గర్భవతిగా పోస్ట్‌మార్టం రిపోర్ట్
Los Angeles model | ఒక మోడల్ మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పోలీసులు గుర్తించారు. (Los Angeles model) ఆమె నోటిని మూసి, కాళ్లు చేతులు కట్టేసి ఉన్నాయని తెలిపారు. హత్యకు గురైన ఆ మోడల్ రెండు నెలల గర్భవతిగా పోస్ట్‌మార్టం రిపోర్ట్ ద్వారా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు.
వాషింగ్టన్: ఒక మోడల్ మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పోలీసులు గుర్తించారు. (Los Angeles model) ఆమె నోటిని మూసి, కాళ్లు చేతులు కట్టేసి ఉన్నాయని తెలిపారు. హత్యకు గురైన ఆ మోడల్ రెండు నెలల గర్భవతిగా పోస్ట్‌మార్టం రిపోర్ట్ ద్వారా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 12న 31 ఏళ్ల మోడల్ మలీసా మూనీ, లాస్ ఏంజెల్స్‌లోని ఆమె అపార్ట్మెంట్లోని ఫ్రిజ్‌లో శవమై కనిపించింది. డ్రగ్స్, మద్యం మత్తులో ఉన్న ఆమెను కొట్టి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాళ్లు, చేతులు కట్టేసి ఫ్రిజ్‌లో కుక్కిన ఆ మోడల్ తల, ముఖం, వీపు, చేతిపై గాయాలున్నట్లు చెప్పారు. చనిపోయే నాటికి ఆమె రెండు నెలల గర్భిణీగా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలిందని పేర్కొన్నారు.
కాగా, మరణించిన మోడల్ మలీసాకు చెందిన ఐక్లౌడ్‌లో ఆమె పరికరాలను ఎవరో వినియోగిస్తున్నట్లు సూచించిన హెచ్చరిక తమ దృష్టికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హంతకుడు ఆమె ఐఫోన్, మ్యాక్‌బుక్‌ను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందన్నారు. మరోవైపు మూనీ మరణించినప్పుడు అనుభవించిన బాధను తాను ఊహించలేనని ఆమె సోదరి, మోడల్ అయిన జోర్డిన్ పౌలిన్ ఆవేదన వ్యక్తం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- body
- Fridge
- los angeles
- Model
RELATED ARTICLES
తాజా వార్తలు
Last Man In Tower | మనసును కదిలించే భావోద్వేగాల ప్రయాణం.. ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

