First Republic: అమెరికాలో మరో బ్యాంకు దివాళా.. జేపీ మోర్గన్ ఆధీనంలోకి ఫస్ట్ రిపబ్లిక్
First Republic: అమెరికాలో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు కుప్పకూలింది. ఆ బ్యాంకును జేపీ మోర్గన్ సంస్థ టేకోవర్ చేసుకోనున్నది. ఇటీవల కాలంలో అమెరికాలో దివాళా తీసిన మూడవ బ్యాంకుగా ఫస్ట్ రిపబ్లిక్ నిలిచింది.
న్యూయార్క్: అమెరికాలో మరో బ్యాంకు దివాళీ తీసింది. ఫస్ట్ రిపబ్లిక్(First Republic) బ్యాంకును జేపీ మోర్గన్ సంస్థ టేకోవర్ చేసుకోనున్నది. ఈ విషయాన్ని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకుకు చెందిన అన్ని డిపాజిట్లు, అసెట్స్‌ను ఇక నుంచి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ జేపీ మోర్గన్ చూసుకోనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఇటీవల అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకులు దివాళా తీసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని నెలల తేడాలోనే అమెరికాలో మూడవ బ్యాంకు మూతపడింది.
శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు షేర్లు గత వారం 75 శాతం పడిపోయాయి. మార్చిలో కస్టమర్లు సుమారు 100 బిలియన్ల డాలర్లు విత్‌డ్రా చేసుకున్నట్లు ఆ బ్యాంకు వెల్లడించింది. బ్యాంకుల మూసివేతతో అమెరికా ఆర్థిక వ్యవస్థ అయోమయంలో పడింది. అయితే ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువచచేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఎమర్జెన్సీ చర్యలు చేపట్టింది.
వాస్తవానికి అమెరికాకు చెందిన సుమారు 11 బ్యాంకులు మార్చి నెలలో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకులోకి 30 బిలియన్ల డాలర్లు ట్రాన్స్ఫర్ చేశాయి. ఫస్ట్ రిపబ్లిక్‌ను స్థిరీకరించేందుకు ప్రయత్నం చేసినా.. ఎటువంటి లాభం జరగలేకపోయింది. 1985లో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును స్థాపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

