Joe Biden | గాజాలో నెతన్యాహూ తప్పు చేస్తున్నారు : అమెరికా అధ్యక్షుడు బైడెన్
Joe Biden | ఇజ్రాయెల్-హమాస్ నడుమ యుద్ధం మొదలైనప్పటి నుంచి తొలిసారి ఇజ్రాయెల్‌ను అమెరికా తప్పుపట్టింది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజామిన్ నెతన్యాహూ తీరుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'నెతన్యాహూ గాజాలో తప్పు చేస్తున్నారు. ఆయన వైఖరిని నేను అంగీకరించను. ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు తక్షణ కాల్పుల విరమణ ప్రకటించాలని నేను ఇజ్రాయెలీలను కోరుతున్నా. ఈ విరామ సమయంలో శరణార్థులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేయొచ్చు’ అని ఓ టీవీ కార్యక్రమంలో బైడెన్ వ్యాఖ్యానించారు.
Joe Biden : ఇజ్రాయెల్-హమాస్ నడుమ యుద్ధం మొదలైనప్పటి నుంచి తొలిసారి ఇజ్రాయెల్‌ను అమెరికా తప్పుపట్టింది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజామిన్ నెతన్యాహూ తీరుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘నెతన్యాహూ గాజాలో తప్పు చేస్తున్నారు. ఆయన వైఖరిని నేను అంగీకరించను. ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు తక్షణ కాల్పుల విరమణ ప్రకటించాలని నేను ఇజ్రాయెలీలను కోరుతున్నా. ఈ విరామ సమయంలో శరణార్థులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేయొచ్చు’ అని ఓ టీవీ కార్యక్రమంలో బైడెన్ వ్యాఖ్యానించారు.
పోయిన వారం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో అమెరికాకు చెందిన ఓ ఎన్జీవో సంస్థలో పనిచేసే ఏడుగురు స్వచ్ఛంద సేవకులు మరణించారు. ఈ ఘటనపై అగ్రరాజ్యం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. జోర్డాన్, సౌదీ, ఈజిప్ట్ దేశాలు కూడా నిత్యం సాయం అందించేలా వారితో సంప్రదింపుతు జరుపుతున్నామని, వారు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారని, ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ వ్యవహరించాల్సిన తీరు సరిగా లేదని విమర్శించారు. అయితే గాజాలోని ప్రజలకు ఔషధాలు, ఆహార సరఫరాలో ఎలాంటి రాజీ ఉండదని చెప్పారు.
మరోవైపు వైట్‌హౌస్ స్పందిస్తూ సంధి కోసం ఇజ్రాయెల్ కొన్ని చర్యలు తీసుకుందని, కానీ హమాస్ వైపు స్పందన అంత ప్రోత్సాహకరంగా లేదని వ్యాఖ్యానించింది. ఇక ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందిస్తూ.. అమెరికా, ఐక్యరాజ్య సమితి డిమాండ్ చేసిన విధంగానే గాజాలోకి సరఫరాలను పెంచామని తెలిపింది. తాము వాటికి ఎలాంటి ఆటంకాలను సృష్టించడం లేదని పేర్కొంది. సోమవారం 468 ట్రక్కులు, మంగళవారం 419 ట్రక్కుల సామాగ్రిని తరలించినట్లు చెప్పింది. యుద్ధం మొదలైన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సామాగ్రిని తరలించడం ఇదే తొలిసారని వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

