బెజోస్ స్పేస్ టూర్ నేడే

- మరో ముగ్గురితో సొంత స్పేస్‌క్రాఫ్ట్ న్యూ షెపర్డ్‌లో పయనం
- కర్మన్ లైన్ దాటి రానున్న బృందం.. స్పేస్ టూరిజాన్ని ప్రోత్సహించడానికే
వాషింగ్టన్, జూలై 19: అంతరిక్ష పర్యాటక రంగంలో మంగళవారం మరో కీలక అడుగు పడనున్నది. అపర కుబేరుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష యానం చేయనున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు వెళ్లనున్నారు. అందులో ఒకరు బెజోస్ సోదరుడు మార్క్. మరో ఇద్దరు.. అత్యంత ఎక్కువ వయస్సులో అంతరిక్ష యాత్ర చేయనున్న మాజీ పైలట్ వాలీ ఫంక్(82) కాగా, మరొకరు అంతరిక్ష యానం చేయనున్న అతి పిన్న వయస్కుడు ఆలివర్ డెమెన్(18). డెమెన్ రూ.209 కోట్లతో ఈ యాత్రలో సీటు సంపాదించుకొన్నారు. బెజోస్‌కే చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ తయారు చేసిన న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్‌లో వీరు అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. వ్యోమగాములు, పరిశోధకులు, శాస్త్రవేత్తలే కాకుండా మామూలు మనుషులకు కూడా అంతరిక్ష యాత్రలను దగ్గర చేయడమే ముఖ్య ఉద్దేశంగా బెజోస్ ఈ యాత్రను తలపెట్టారు. వర్జిన్ గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్, భారత సంతతికి చెందిన బండ్ల శిరీష ఇటీవల అంతరిక్ష యాత్ర చేసినప్పుడు కర్మన్ లైన్(భూ ఉపరితలానికి కనీసం 100 కిలోమీటర్ల ఎత్తు) దాటలేదని, కర్మన్ లైన్ దాటితేనే అంతరిక్ష యాత్ర అని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బెజోస్ బృందం కర్మన్ లైన్‌ను దాటి రానున్నారు. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు పశ్చిమ టెక్సస్ నుంచి ఈ ఎయిర్ క్రాఫ్ట్ రోదసిలోకి వెళ్లనున్నది. ఇది అటానమస్ ఎయిర్ క్రాఫ్ట్. దీనిలో పైలట్ ఉండరు. దానికదే నడుస్తుంది. న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్‌లో మనుషులు ప్రయాణించడం ఇదే తొలిసారి. గతంలో ట్రయల్స్ నిర్వహించినప్పటికీ అందులో మనుషులు ప్రయాణించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

