గాల్లో తేలిన క్షణాలను ఇన్‌స్టాలో పంచుకున్న జెఫ్ బెజోస్..వీడియో
Jeff Bezos: ఆ అనుభూతిని మరింత ఇనుమడింప జేసుకోవడానికి ఈ అంతరిక్ష యాత్ర నిర్వాహకుడు జెఫ్ బెజోస్.. వారు అంతరిక్షంలో తేలియాడిన క్షణాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

టెక్సాస్: బ్లూ ఆరిజిన్‌కు చెందిన వ్యోమనౌక న్యూ షెపర్డ్ మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. దాంతో ఆ వ్యోమనౌకలో ప్రయాణించిన జెఫ్ బెజోస్‌తోపాటు అతని సిబ్బంది చాలామందిలో ఉత్సాహం ఉరకలేస్తున్నది. ఆ అనుభూతిని మరింత ఇనుమడింప జేసుకోవడానికి ఈ అంతరిక్ష యాత్ర నిర్వాహకుడు జెఫ్ బెజోస్.. వారు అంతరిక్షంలో తేలియాడిన క్షణాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్పేస్ క్రాఫ్ట్ భూమ్యాకర్షణ శక్తిని దాటి వెళ్లిన తర్వాత బెజోస్ సహా అందులోని పర్యాటకులు గాల్లో తేలియాడారు.
జెఫ్ బెజోస్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఆ వీడియోలో తనతోపాటు తన సోదరుడు మార్క్, వాలీ ఫంక్, ఆలివ్ డెమెన్.. భూవాతావరణం వెలుపల జీరో గ్రావిటీ స్థితిని అనుభవించారు. ఆ సమయంలో కాసేపు స్పేస్ క్యాప్సూల్ లోపల దూదిపింజాల్లా తేలియాడారు. న్యూ షెపర్డ్ అంతరిక్ష నౌకను వెస్ట్ టెక్సాస్ ఎడారిలోని బ్లూ ఆరిజిన్‌కు సంబంధించిన ప్రైవేట్ లాంచింగ్ సైట్ నుంచి చిత్రీకరించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అంతరిక్ష సరిహద్దు ఆవల ఈ వీడియో చిత్రీకరించబడింది.
స్పేష్ క్రాఫ్ట్‌కు ఉన్న విశాలమైన కిటికీల నుంచి బ్యాక్‌గ్రౌండ్‌లో భూమి కూడా కనిపిస్తున్నది. బెజోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్టుతోపాటు “This is how it starts. #gradatimferociter,” అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ‘Gradatim Ferociter’ అనేది బ్లూ ఆరిజన్ నినాదం. దీనికి అడుగు, అడుగుకు క్రూరంగా అని అర్థమట. అంతరిక్షంలో పర్యటించిన అతిపెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందిన 82 ఏండ్ల వాలీ ఫంక్.. “ఫెన్టాస్టిక్.. దట్ ఈజ్ గ్రేట్… ఐ లవ్ ఇట్..” అంటున్న వ్యాఖ్యలు కూడా ఆ వీడియోలో వినిపిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

