Human Embryo | వీర్యం, అండం లేకుండానే పిండాన్ని సృష్టించిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు
ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. స్త్రీ, పురుషుల కలయికతో సంబంధం లేకుండానే పిండాన్ని సృష్టించారు. ఒక జీవి ప్రాణం పోసుకోవాలంటే అండం, శుక్రకణం తప్పనిసరి. ఏవో కొన్ని ఏకకణ జీవుల్లో మాత్రమే ఇందుకు మినహాయింపు. మనిషి పుట్టుకకు మాత్రం అండం, శుక్రకణం తప్పక కలవాల్సిందే.
- మూలకణం వినియోగించి ల్యాబ్‌లో అభివృద్ధి
Human Embryo | జెరూసలేం: ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. స్త్రీ, పురుషుల కలయికతో సంబంధం లేకుండానే పిండాన్ని సృష్టించారు. ఒక జీవి ప్రాణం పోసుకోవాలంటే అండం, శుక్రకణం తప్పనిసరి. ఏవో కొన్ని ఏకకణ జీవుల్లో మాత్రమే ఇందుకు మినహాయింపు. మనిషి పుట్టుకకు మాత్రం అండం, శుక్రకణం తప్పక కలవాల్సిందే. కానీ, ఇకపై వాటితో అవసరం లేకుండానే పిల్లలను పుట్టించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. జీవకణంతో మానవ పిండాన్ని సృష్టించారు. అదికూడా మహిళ గర్భంలో కాకుండా ప్రయోగశాలలో సృష్టించటం విశేషం. రెహోవొత్‌లోని వీజ్‌మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన పరిశోధకుల బృందం ఈ విప్లవాత్మక ఆవిష్కరణ చేసింది. మనిషి మూలకణాన్ని ఉపయోగించి అచ్చం మానవ పిండాన్ని పోలిన ఆకారాన్ని వారు సృష్టించారు. ఈ పిండం ప్రయోగశాలలో 14 రోజులపాటు పెరిగింది. తల్లిగర్భంలో పిండం రూపుదాల్చే ప్రారంభ దశలో ఎలా ఉంటుందో ఈ కృత్రిమ పిండం కూడా అచ్చం అలాగే ఉన్నదని పరిశోధకులు తెలిపారు.

1 శాతమే సఫలమైనా…
సాధారణంగా గర్భం దాల్చినప్పుడు మొదటి నెలలోనే సమస్యలు తలెత్తుతాయి. ఆ సమయంలోనే గర్భవిచ్ఛిత్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అసలు ఆ సమయంలో పిండం పెరుగుదల ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఇజ్రాయెల్ పరిశోధకులు అనుకున్నారు. పరిశోధకులు మొదట ఎలుకలపై ఈ అధ్యయనం చేసి సఫలం అయ్యారు. అనంతరం ప్రయోగశాలలో పిండం రూపొందించేందుకు పూనుకున్నారు. మూలకాణాలను సేకరించి వాటిపై పరిశోధనలు చేశారు. ఓ కణం పిండంగా మారాలంటే ప్లాసెంటా, మెంబ్రెన్, యోల్క్ శాక్, అమ్నియోటిక్ శాక్ తదితరాలు అవసరమవుతాయి. దీని కోసం మూలకణానికి ముందుగానే పిండంగా మారేలా ప్రోగ్రామింగ్ చేశారు. మూల కణం పిండంగా మారేందుకు నాలుగు రకాల కణాలను రసాయనాలను ఉపయోగించి ప్రేరేపితం చేశారు. వాటిలో మొదటిది ఎపిబ్లాస్ట్ కణాలు. ఇవి పిండంగా మారేందుకు అవసరమవుతాయి. రెండోది ట్రోపోబ్లాస్ట్ కణాలు.. ఇవి ప్లాసెంటాను ఉత్పత్తి చేస్తాయి. మూడోది హైపోబ్లాస్ట్ కణాలు.. ఇవి పిండానికి అవసరమైన యోల్క్ శాక్ (పొర)ను రూపొందించేందుకు దోహదపడతాయి. నాలుగోది మెస్మోడెర్మ్ కణాలు.. ఇవి అమ్నియోటిక్ శాక్‌గా రూపాంతరం చెందుతాయి. అయితే 120 రకాల కణాలను పరస్పరం మిక్స్డ్ చేయగా.. వాటిలో 1 శాతం మాత్రమే సఫలమై పిండంగా రూపాంతరం చెందింది. అనంతరం మానవుల తరహాలోనే గర్భధారణ పరీక్ష చేసేందుకు వీలుగా హార్మోన్‌ను సైతం ఈ పిండం విడుదల చేసినట్టు పరిశోధకులు తెలిపారు.

అవయవాల ఉత్పత్తి
‘9-12 వారాల వయసున్న దాన్నే పిండంగా పేర్కొంటారు. ఆ సమయంలోనే మానవ అవయవాలు, అన్ని రకాల వ్యవస్థలు తయారై మానవ రూపం సంతరించుకుంటుంది. అప్పుడే పిండంగా పేర్కొంటారు. ఈ మోడల్ సృష్టి విరుద్ధం. ఈ మోడల్‌ను ఉపయోగించి మానవ అవయవాలను ఉత్పత్తి చేసుకోవచ్చు’ అని ప్రొఫెసర్ హన్నా తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

