Iran-US | మరో విమానాన్ని కూల్చామన్న ఇరాన్.. తప్పించుకున్న పైలట్.. బంధించాలంటూ ప్రజలకు పిలుపు
Iran-US : అమెరికాకు చెందిన ఎఫ్ 35 యుద్ధ విమానాన్ని కూల్చామని ప్రకటించిన ఇరాన్.. ఇప్పుడు ఇంకో అమెరికా విమానాన్ని కూడా కూల్చినట్లు వెల్లడించింది. ఎఫ్15 ఈ అనే మరో యుద్ధ విమానాన్ని కూడా కూల్చినట్లు తెలిపింది.
Iran-US : అమెరికాకు చెందిన ఎఫ్ 35 యుద్ధ విమానాన్ని కూల్చామని ప్రకటించిన ఇరాన్.. ఇప్పుడు ఇంకో అమెరికా విమానాన్ని కూడా కూల్చినట్లు వెల్లడించింది. ఎఫ్15 ఈ అనే మరో యుద్ధ విమానాన్ని కూడా కూల్చినట్లు తెలిపింది. ఈ ఘటనలో పైలట్ తప్పించుకున్నాడని, అతడిని ఎక్కడున్నా పట్టుకోవాలని ఇరాన్ మీడియా కోరింది. మరోవైపు ఇప్పటికే ఒక పైలట్‌ను ఇరాన్ బంధించినట్లు ఇంకో ప్రచారం జరుగుతోంది.
ఇరాన్ సైన్యం అయిన ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ జరిపిన ప్రతి దాడిలో అమెరికాకు చెందిన ఎఫ్35 యుద్ధ విమానం కూలింది. నైరుతి ఇరాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పైలట్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఘటనా స్థలికి స్థానికులు, అధికారులు భారీ ఎత్తున చేరుకున్నారు. పైలట్‌ను వారు పట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అతడిపై దాడి చేయొద్దని అక్కడి ఆర్మీ కోరినట్లు సమాచారం. అలాగే, ఎఫ్15ఈ అనే మరో యుద్ధ విమానాన్ని కూడా ఇరాన్ కూల్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ విమానానికి సంబంధించిన శకలాలను కూడా అధికారులు గుర్తించారు. పైలట్‌కు సంబంధించిన ఆచూకీ మాత్రం తెలియలేదు. కానీ, అతడు కూడా తప్పించుకుని ఉంటాడని భావిస్తున్నారు. దీనిపై ఇరాన్ మీడియా ఒక ప్రకటన చేసింది.
Iran said it shot down a US Air Force fighter jet over its territory and released images that appear to show the wreckage of a jet that online commentators say is an F-15E Strike Eagle from the 494th Fighter Squadron. Analysts said debris in the video matches the F-15E’s design.… pic.twitter.com/fdaK72MSmF
— Iran International English (@IranIntl_En) April 3, 2026
అమెరికన్ యుద్ధ విమాన పైలట్ కోసం వెతకాలని, ఒకవేళ అతడు కనబడితే పోలీసులకు అప్పగించాలని సూచించింది. ఇంకొందరు మాత్రం ఈ ఘటనలో పైలట్ మరణించి ఉండొచ్చని అంటున్నారు. రెండు విమానాలు కూలిన ఘటనలో పైలట్లకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ అంశంలో ఇటు ఇరాన్, అటు అమెరికా ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు పైలట్ల జాడ కోసం అమెరికా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

