Vladimir Putin | పుతిన్‌కు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ న్యాయస్థానం
Vladimir Putin : ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి లక్షలాదిమంది ప్రాణాలు బలిగొంటున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)కు షాక్.. ది హేగ్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్‌లో జరుగుతున్నయుద్ధానికి పుతిన్ బాధ్యుడు అని పేర్కొంది.
Vladimir Putin : ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి లక్షలాదిమంది ప్రాణాలు బలిగొంటున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)కు షాక్.. ది హేగ్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ‘ఉక్రెయిన్‌లో జరుగుతున్నయుద్ధానికి పుతిన్ బాధ్యుడు. అంతేకాదు ఆ దేశంలో ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి అక్కడి ప్రజలను.. ముఖ్యంగా పిల్లలను రష్యాకు అక్రమంగా తరలిస్తున్న యుద్ధ నేరస్థుడు పుతిన్’ అంటూ ఐసీసీ తన అరెస్ట్ వారెంట్‌లో పేర్కొంది.
ఉక్రెయిన్ పిల్లలను అక్రమంగా రష్యాకు తరలిస్తున్నందుకు రష్యా పిల్లల హక్కుల కమిషనర్ మరియా అలెక్సేఎవ్నా వోవా బెలోవాపై కూడా ఐసీసీ న్యాయమూర్తులు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. అంతేకాదు ఉక్రెయిన్‌లో జరుగుతున్న నరమేధానికి రష్యా అధ్యక్షుడే కారణం అనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయని అంతర్జాతీయ న్యాయస్థానం తెలిపింది.ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మొదటగా పుతిన్, మరియాపై రహస్యంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయాలనుకుంది. అయితే.. వాళ్లపై బహిరంగంగా అరెస్ట్ వారెంట్ ఇస్తే, మరిన్ని నేరాలను అదుపులో పెట్టవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు న్యాయమూర్తులు వెల్లడించారు.
స్వాగతించిన ఉక్రెయిన్
రష్యా విదేశాంగ శాక మీడియా ప్రతినిధి మరియా జఖరోవా మాత్రం అరెస్ట్ వారెంట్‌ను కొట్టిపారేశారు. ‘అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయం తమ దేశానికి ఏమాత్రం వర్తించదని, న్యాయపరంగానూ అది చెల్లద’ని మరియా తన టెలిగ్రామ్ ఛానెల్లో తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయాన్ని స్వాగతించింది. ‘ఇది ఆరంభం మాత్రమే’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడి మఖ్య అధికారి ఒకరు సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. 2022 ఫిబ్రవరి 24 రష్యా, ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఈ వార్ కారణంగా.. ఇరుదేశాలకు చెందిన సైనికులు లక్షల్లో ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని పొరుగు దేశాలకు వలస వెళ్లారు.
ఇవి కూడా చదవండి
Ram Sahay Prasad Yadav | నేపాల్ మూడో వైస్ ప్రెసిడెంట్‌గా రామ్ సహయ్ ప్రసాద్ యాదవ్
Imran Khan | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ వారెంట్ సస్పెండ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | విటమిన్ B12 లోపాన్ని లైట్ తీసుకుంటున్నారా.. గుండెకు, లివర్‌కు ప్రమాదమట తెలుసా..?
KCR | కేసీఆర్‌తో ఆదిలాబాద్ యువనేత భార్గవ్ దేశ్‌పాండే భేటీ
Delhi Air Pollution | ఢిల్లీలో పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్.. 325కి పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..!
బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ట్రావెల్స్ బస్సులకు మంటలు.. మూడు బస్సులు దగ్ధం!
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

