IndiGo | మెరుగుపడిన ఇండిగో కార్యకలాపాలు.. రోజుకు 2 వేల విమానాల రాకపోకలు
IndiGo | ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. వరుసగా రెండోరోజు కూడా 2 వేలకుపైగా విమానాలను నడిపినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
IndiGo : ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. వరుసగా రెండోరోజు కూడా 2 వేలకుపైగా విమానాలను నడిపినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. గత ఐదు రోజులుగా తమ కార్యకలాపాలు నిలకడగా కొనసాగుతున్నాయని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సవరించిన షెడ్యూల్ ప్రకారం రోజుకు 2 వేలకుపైగా విమానాలను నడుపుతున్నామని ఇండిగో తెలిపింది.
సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మొత్తం 138 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయని, సమయపాలన కూడా సాధారణ స్థాయికి చేరిందని ఇండిగో పేర్కొంది. కాగా ఈ నెల ప్రారంభంలో ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. డిసెంబర్ 8న 1,700కి పైగా విమానాలు నడిపిన ఇండిగో, ఆ సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ వచ్చింది.
డిసెంబర్ 12న 2,050కి పైగా విమానాలను ఆపరేట్ చేయగా కేవలం రెండు సర్వీసులు మాత్రమే సాంకేతిక కారణాలతో రద్దయ్యాయని కంపెనీ తెలిపింది. డిసెంబర్ 13న కూడా 2,050కి పైగా విమానాలు నడుపాలన్నా అంచనాలకు ఇండిగో చేరువైంది. కార్యకలాపాలలో వైఫల్యానికి గల కారణాలను విశ్లేషించడానికి ‘చీఫ్ ఏవియేషన్ అడ్వైజర్స్ ఎల్ఎల్సీ’ అనే స్వతంత్ర కన్సల్టెన్సీని నియమించినట్లు సంస్థ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

