మరికాసేపట్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ అరెస్ట్ అయ్యే ఛాన్స్?
పాక్ ప్రధానిని అరెస్ట్ చేయమని ఆ దేశ సుప్రీం కోర్టు ఆదేశించే అవకాశాలు మెండుగా వున్నాయి. అర్ధరాత్రి 12 గంటల వరకూ జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జరగకపోతే కోర్టు ధిక్కరణ ప్రధాని ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రధాని ఇమ్రాన్‌తో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ వుంది. మరోవైపు అర్థరాత్రి 12 గంటల వరకూ సుప్రీం కోర్టు తలుపులు తెరిచే వుంచాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు. ఇక… ప్రధాని ఇమ్రాన్ జాతీయ అసెంబ్లీకి హాజరైనట్లు సమాచారం. ఈ రాత్రి ఏమైనా జరగొచ్చని అంచనాలు వేస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాస తీర్మానం అనే.. అంశమే దగ్గరికి రాకుండా పాక్ ప్రధాని ఇమ్రాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రయత్నాలతో పాటు ఆయన ప్రతిపక్షం ముందు 3 షరతులను కూడా విధించారు. అందులో మొదటి షరతు… పదవి కోల్పోయిన తర్వాత తనను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయకూడదు. ఎన్బీఏ కింద తనను అరెస్ట్ చేయకూడదన్నది రెండో షరతు. విపక్ష నేత షహబాజ్ షరీఫ్‌ను తదుపరి ప్రధానిగా చేయకూడదన్నది ఇమ్రాన్ మూడో షరతు. అయితే విపక్షాలు మాత్రం ఈ షరతులపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయకపోవడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

