Ghost | బాయ్‌ఫ్రెండ్ 16సార్లు కత్తితో పొడిచి పారిపోతే.. దెయ్యం వచ్చి కాపాడిందట.. ఇంట్రెస్టింగ్ స్టోరీ
Ghost | దెయ్యాలు (Ghost) ఉన్నాయా..? లేవా..? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం. అయితే ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అమెరికా (America)కు చెందిన ఓ టీచర్ మాత్రం దెయ్యాన్ని చూశానని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తనని దెయ్యమే కాపాడిందని చెబుతోంది.
Ghost | దెయ్యాలు (Ghost) ఉన్నాయా..? లేవా..? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం. అయితే ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. కొందరు దయ్యాలను చూశాం, వాటితో మాట్లాడాం అంటుంటారు. దెయ్యాలు ఉన్నాయని బలంగా నమ్ముతున్నట్లు చెబుతుంటారు. అవి మనతో పాటే జీవనం కొనసాగిస్తున్నాయని విశ్వసిస్తారు. మరికొందరు హేతువాదులైతే దెయ్యాలు లేవు గియ్యాలు లేవు అంటూ వాదిస్తుంటారు. దెయ్యాలనేవే ఉండవు.. అది మన భ్రమ మాత్రమే అంటూ చెప్తుంటారు. అయితే, అమెరికా (America)కు చెందిన ఓ టీచర్ మాత్రం దెయ్యాన్ని చూశానని చెప్పుకొచ్చింది. బాయ్ ఫ్రెండ్ తనని కత్తితో అతి దారుణంగా పొడిచి వెళ్లిపోతే.. రక్తపు మడుగుల్లో పడి ఉన్న తనని చూసి రెండు దెయ్యాలు పగలబడి నవ్వాయని.. ఆ సమయంలో మరో దెయ్యం వచ్చి తనని రక్షించిందంటూ షాకింగ్ ఘటనను బయటపెట్టింది.
టెక్సాస్ (Texas) రాష్ట్రానికి చెందిన ఇలిష్ పో (Eilish Poe) అనే 25 ఏళ్ల యువతి కొలరాడో (Colorado)లో ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఇటీవలే ఓ షోలో పాల్గొన్న ఆమె గతంలో తన జీవితంలో జరిగిన ‘దెయ్యం’ ఘటనను వివరించింది. 2020 సంవత్సరంలో ప్రియుడు తనపై దాడికి పాల్పడ్డాడని చెప్పింది. 16 సార్లు కత్తితో పొడిచి చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపింది. రక్తపు మడుగుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ సమయంలో తనకు మూడు దెయ్యాలు కనిపించాయని చెప్పింది. అందులో ఒక దెయ్యం తన అమ్మమ్మ అని తెలిపింది.
తన అమ్మమ్మ జీనీ 2014లోనే మరణించిందంట. మరొకరు తన చిన్ననాటి స్నేహితుల్లో ఒకరైన విక్కీ అని, అతను 2020 ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. ఆ ఇద్దరూ తనను చూస్తూ గట్టిగా నవ్వుతున్నారట. వీరిద్దరితోపాటు తన దూరపు చుట్టమైన మరొక అమ్మాయి అలీసా బర్కెట్ (Alyssa Burkett) ఆత్మ కూడా కనిపించిందని ఇలిష్ పో తెలిపింది. అలీసానే తనని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిందని చెప్పుకొచ్చింది.
తనను ఫోన్ వద్దకు తీసుకెళ్లి పోలీసులకు ఫోన్ చేసేలా ప్రోత్సహించిందని, అలీసా దెయ్యం సహకారంతో తాను పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పినట్లు వివరించింది. దాంతో పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పుకొచ్చింది. అయితే, ఆస్పత్రిలో కోలుకుంటున్న సమయంలో కూడా తనకు 50 నుంచి 100 సార్లు అస్పష్టమైన రూపాలు కనిపించాయని ఆనాటి షాకింగ్ ఘటనను వివరించింది. ఈ మేరకు తన ప్రాణాలను కాపాడిన ఆ దెయ్యానికి ఇలిష్ పో కృతజ్ఞతలు తెలిపింది. ఇలిష్ పోకు చెందిన ఈ ఆసక్తికర ‘దెయ్యం’ కథ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
Also Read..
Yamuna River | మళ్లీ డేంజర్ మార్క్‌ను దాటిన యమునా నది ప్రవాహం.. ఆందోళనలో ఢిల్లీ వాసులు
Darren Kent | గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు డారెన్ కెంట్ కన్నుమూత
Jacqueline Fernandez | మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌కు భారీ ఊరట
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Colorado
- Eilish Poe
- Ghost
- Texas
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

