న్యూయార్క్, మే 2: రెండు కిలోమీటర్ల వెడల్పున్న ఓ గ్రహశకలం గంటకు 50 వేల కి.మీ. వేగంతో భూమికి దగ్గరగా వస్తున్నది. ఆ ఆస్టరాయిడ్ పేరు 1989జేఏ. తన కక్ష్యలో తిరుగుతూ ఈ నెల చివర్లో భూమికి అత్యంత సమీపంగా (40.24 లక్షల కి.మీ. దూరం) రానున్నది. ఈ ఆస్టరాయిడ్‌ను 1989లో గుర్తించారు.
1996లో కూడా ఇది భూమికి దగ్గరగా వచ్చినా ప్రమాదం జరగలేదు. అయితే ఇది ప్రమాదకరమైందని నాసా పేర్కొంది.