Holi | దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుతున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా రంగుల పండులో పాల్గొన్నారు. పలు దేశాల్లోనూ హిందువులు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. హోలీ సందర్భంగా ఆస్ట్రేలియాలోని హిందువుల ఆస్ట్రేలియా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఇక పొరుగు దేశమైన పాక్‌లోని హిందూ సమాజానికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హోలీ, అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ శుభాకాంక్షలు చెప్పారు. పాక్ రాజ్యాంగం మత స్వేచ్ఛకు భరోసా ఇస్తుందన్నారు.
పండుగ హిందువుల జీవితాల్లోనే కాకుండా ప్రజలందరి జీవితాల్లో శాంతి, శ్రేయస్సు, సంతోషాన్ని తీసుకురావాలని తన సందేశంలో పేర్కొన్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ సైతం హోలీ వేడుకలు జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు చెప్పారు. పంజాబ్ సీఎం మరియం నవాజ్ సైతం హోలీ సందర్భంగా హిందూ సమాజానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. 700 హిందూ కుటుంబాలకు ప్రత్యేక హోలీ ప్యాకేజీని సీఎం ప్రకటించారు. ప్యాకేజీలో ఒక్కొక్కరికి రూ.10వేల చెక్కులను పంపిణీ చేయనున్నారు.