హెచ్ఐవీ తల్లులూ పాలివ్వొచ్చు
హెచ్ఐవీతో బాధపడుతున్న తల్లులు పిల్లలకు పాలివ్వడంపై అమెరికాలో దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఎత్తివేసింది. హెచ్ఐవీ తల్లులు కూడా పిల్లలకు పాలివ్వొచ్చని స్పష్టం చేసింది. నిషేధాన్ని వెనక్కి తీసుకోవడానికి గల కారణాన్ని కూడా పేర్కొంది.
- దశాబ్దాల నాటి నిషేధానికి అమెరికాలో చెల్లుచీటీ
వాషింగ్టన్: హెచ్ఐవీతో బాధపడుతున్న తల్లులు పిల్లలకు పాలివ్వడంపై అమెరికాలో దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఎత్తివేసింది. హెచ్ఐవీ తల్లులు కూడా పిల్లలకు పాలివ్వొచ్చని స్పష్టం చేసింది. నిషేధాన్ని వెనక్కి తీసుకోవడానికి గల కారణాన్ని కూడా పేర్కొంది. ఎయిడ్స్‌కు దారితీసే హెచ్ఐవీతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం నాణ్యమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
వారు వాడుతున్న మందులు తల్లిపాల ద్వారా బిడ్డకు వైరస్ సోకే ముప్పును ఒకశాతంలోపునకే పరిమితం చేస్తున్నట్టు కొలరాడో యూనివర్సిటీ హెచ్ఐవీ నిపుణురాలు, అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ లిసా అబౌగి తెలిపారు. హెచ్ఐవీని అదుపులో ఉంచే చికిత్సా విధానం దశాబ్దం క్రితం విస్తృతమైంది. అంతకుముందు తల్లిపాల నుంచి పిల్లలకు వైరస్ సోకే ముప్పు 30 శాతంగా ఉంటే ప్రస్తుతం అది ఒక శాతానికి తగ్గిం ది.
1990ల మొదట్లో అమెరికాలో ప్రతి సంవత్సరం 2 వేలమంది చిన్నారులు హెచ్ఐవీ బారినపడేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 30 లోపే ఉంది. అమెరికాలో హెచ్ఐవీతో బాధపడుతున్న మహిళల్లో ప్రతి ఏటా ఐదువేల మంది బిడ్డలకు జన్మనిస్తున్నారు. హెచ్ఐవీ తల్లులు బిడ్డలకు తల్లిపాలు ఇవ్వవద్దంటూ వైరస్ వెలుగు చూసి తొలినాళ్లలో అంటే 1980లలో అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రతిపాదించింది. ఇప్పుడు చికిత్సా విధానాలు పెరగడం, హెచ్ఐవీ సంక్రమణను అదుపులో ఉంచే మెరుగైన మందులు అందుబాటులోకి రావడంతో ఈ నిషేధాన్ని వెనక్కి తీసుకుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- breastfeed
- HIV
- HIV mother
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

