న్యూయ్యార్క్, అక్టోబర్ 23: తల వెంట్రుకలు చిక్కులు పడకుండా స్ట్రెయిట్‌గా ఉండాలని, నిగనిగలాడాలని మహిళలు అనేక రకాల రసాయన ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే, ఇలాంటి హెయిర్ స్ట్రెయిట్నర్ కెమికల్స్‌తో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ఉత్పత్తులను ఎప్పుడూ వాడని మహిళలతో పోల్చితే వాడే మహిళలకు ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ వస్తున్నట్టు గుర్తించారు.
కొన్నేండ్లుగా అమెరికాలోని శ్వేత, నల్లజాతి మహిళలపై యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు. హెయిర్ స్ట్రెయిట్నర్ రసాయనాలను పట్టించినప్పుడు హానికారకాలు తల మీది చర్మం గుండా శరీరంలోకి ప్రవేశించి గర్భాశయ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని పేర్కొన్నారు.