Grave digger to Millionaire | సమాధులు త్వవ్వే వ్యక్తికి జాక్‌పాట్.. 3 నంబర్‌పై రూ.2 కోట్ల ప్రైజ్‌మనీ
Grave digger to Millionaire | అమెరికాలో సమాధులు తవ్వే ఒక వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. ఒక లాటరీలో తన అభిమాన డ్రైవర్ కారు నంబర్‌ను ఎంచుకుని కాచాడు. ఇదే నంబర్‌పై జాక్‌పాట్ తగలడంతో ఆయనకు రూ.2 కోట్ల మొత్తం అందివచ్చింది.
Grave digger to Millionaire | అమెరికాలో సమాధులు తవ్వ పనిలో నిమగ్రమయ్యే ఓ వ్యక్తికి జాక్‌పాట్ వరించింది. తన అభిమాన వ్యక్తి కారు నంబర్‌పైనే బెట్టింగ్ కాసి తొలి ప్రయత్నంలోనే కోటీశ్వరుడయ్యాడు. నిన్నటి వరకు తిండి కోసం పరితపించిన ఈ 63 ఏండ్ల వ్యక్తి.. ఇవాల కోటీశ్వరుడిగా మారడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
అమెరికా నార్త్ కరోలినాలోని లింకన్టన్లో నివసించే లూథర్ డౌడీ స్థానికంగా గ్రేవ్ యార్డ్‌లో సమాధులు తవ్వే పని చేస్తుంటాడు. ఆయన బాగా ఆభిమానించే ప్రొఫెషనల్ డ్రైవర్ డేల్ ఎర్న్‌హార్డ్ రేసింగ్ కారు నంబర్ 3. ఇదే నంబర్‌పై ఆతడు ఇటీవల పందెం కాచాడు. మరుసటి రోజే అతడు రూ.2 కోట్ల జాక్‌పాట్ సొంతం చేసుకున్నాడు. లాటరీ ఆడిన తొలిసారే ఇలా లక్షాధికారి అవుతానని అనుకోలేదంటున్నాడు లూథర్. ఇంత భారీ మొత్తంలో లాటరీ గెలుచుకుంటానని అస్సలు ఊహించలేదంటున్నాడాయన.
తన అభిమాన డ్రైవర్ కారు నంబర్‌తో పాటు మరో రెండు నంబర్లను ఎంచుకున్నాడు. క్విక్ పిక్‌లో లాటరీలో ఇదే నంబర్‌కు జాక్‌పాట్ వచ్చిందని తెలియడంతో లూథర్ డౌడీ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఈ లాటరీ సొమ్ముతో రుణం తీర్చుతానని, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న తన పొరుగింటి వ్యక్తిని ఆదుకుంటానని చెప్తున్నారు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో ఇక చేసే పనికి వీడ్కోలు పలికి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాడట లూథర్ డౌడీ.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
Sai Pallavi | నా బ్రెయిన్ వాడలేదు.. సీత పాత్రపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

