‘ఐ కాంట్ బ్రీత్’కు గ్రామీ
- ఈ ఏడాది బెస్ట్ సాంగ్‌గా ఎంపిక
- బెయాన్స్కు 4 అవార్డులు.. మొత్తం 28
- అత్యధిక గ్రామీలు పొందిన మహిళగా చరిత్ర
లాస్ఏంజెల్స్, మార్చి 15: గతేడాది అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ హత్య తర్వాత శ్వేత జాతి జాత్యహంకారాన్ని ధిక్కరిస్తూ గాబ్రియెల్లా విల్సన్(హెచ్.ఈ.ఆర్) రాసిన ‘ఐ కాంట్ బ్రీత్’ పాటకు ఈ ఏడాది బెస్ట్ సాంగ్‌గా గ్రామీ అవార్డు దక్కింది. హెచ్.ఈ.ఆర్ పొలిటికల్ ఆంథమ్ పేరుతో ఈ పాటను విడుదల చేశారు. గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం(63వది) లాస్ఏంజెల్స్ కన్వెన్షన్ సెంటర్లో కొవిడ్ నిబంధనలతో జరిగింది. పాప్ సింగ్ బెయాన్స్ అత్యధికంగా నాలుగు గ్రామీ అవార్డులను కైవసం చేసుకొన్నారు. బెస్ట్ ర్యాప్ సాంగ్‌గా ఆమె పాడిన ‘సావేజ్’కు అవార్డు లభించింది. తాజా అవార్డులతో బెయాన్స్ మొత్తం గ్రామీ అవార్డుల సంఖ్య 28కి పెరిగింది. తద్వారా అత్యధిక గ్రామీ అవార్డులు గెలుచుకొన్న మహిళగా బెయాన్స్ చరిత్ర సృష్టించారు. టేలర్ స్విఫ్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ‘ఫోక్లోర్’కు ఈ ఏడాది ఉత్తమ ఆల్బమ్ అవార్డు, జేమ్స్ బాండ్ ‘నో టైం టు డై’ చిత్రానికి రాసిన ఓ పాటకు గాను ఎలిస్‌కు ఉత్త గేయరచయితగా అవార్డులు వచ్చాయి. విడుదల కాని ఓ సినిమాకు అవార్డు ప్రకటించడం గ్రామీ చరిత్రలో ఇదే తొలిసారి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

