Glacial Lake Outburst | భూటాన్‌లో హిమానీనదం విస్ఫోటనం.. బెంగాల్, అస్సాంలకు వరద ముప్పు.. కేంద్రం హైఅలర్ట్..!
Glacial Lake Outburst | భూటాన్ (Bhutan) దేశంలోని గాసా జిల్లా (Gasa district) లో షింటాఫు సరస్సు (Shintaphu Lake) ఉప్పొంగి వరద సంభవించింది. దాంతో పశ్చిమబెంగాల్ (West Bengal), అస్సాం (Assam) లోని కొన్ని ప్రాంతాలకు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీఅయ్యాయి. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనవల్ల గాసా జిల్లాలోని మోచు నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ సహజ వేడినీటి బుగ్గ (Natural hot spring) అయిన గాసా త్శాచు (Gasa Tshachu) లోని సౌకర్యాలు పూర్తిగా కొట్టుకుపోయాయి.
Glacial Lake Outburst : భూటాన్ (Bhutan) దేశంలోని గాసా జిల్లా (Gasa district) లో షింటాఫు సరస్సు (Shintaphu Lake) ఉప్పొంగి వరద సంభవించింది. దాంతో పశ్చిమబెంగాల్ (West Bengal), అస్సాం (Assam) లోని కొన్ని ప్రాంతాలకు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీఅయ్యాయి. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనవల్ల గాసా జిల్లాలోని మోచు నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ సహజ వేడినీటి బుగ్గ (Natural hot spring) అయిన గాసా త్శాచు (Gasa Tshachu) లోని సౌకర్యాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. అయితే ముందుగానే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
మోచు నది ప్రారంభంలోనే ఉన్న షింటాఫు సరస్సు భూటాన్‌లోని 17 ప్రమాదకరమైన హిమానీనద సరస్సులలో ఒకటి. 2021 ఆగస్టు 26న మోచు నది ఉప్పొంగడంతో గాసా త్శాచు ఆకస్మిక వరదకు కొట్టుకుపోయింది. పునాఖా జోంగ్ నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కబేసా గెవాగ్లోని శ్రీగాంగ్ను ఇప్పుడు వరదనీరు దాటింది. భూటాన్ సరిహద్దు జిల్లాల్లో ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉండటంతో మనదేశంలో కూడా పశ్చిమబెంగాల్, అస్సాం ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది.
అస్సాంలోని ధుబ్రి, పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ కొండ ప్రాంతాలు, అలాగే అలీపుర్దువార్, జల్పాయిగురి జిల్లాలు ఈ ముప్పు పొంచి ఉన్న వాటిలో ఉన్నాయి. పశ్చిమబెంగాల్లోని కూచ్ బెహార్లో, సంకోష్ నది ఒడ్డున ఉన్న ప్రజలు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు.
హిమానీనదం విస్ఫోటనం అంటే..?
హిమానీనదం విస్ఫోటనం అంటే పూర్వపు హిమానీనదాల పక్కన సరస్సులుగా పేరుకుపోయిన మంచు అకస్మాత్తుగా కరిగి ఉప్పొంగడం. హిమానీనదాలు ఉధృతంగా ప్రవహించి ఆ తర్వాత ప్రవాహం తగ్గడంతో ఇలాంటి సరస్సులు ఏర్పడుతాయి. ఇది సహజంగా సంభవించే ఒక దృగ్విషయం. కానీ మానవ ప్రేరిత వాతావరణ మార్పులతో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఇవి విఫ్పోటనం చెందుతున్నాయి. అధిక నీటిని నిల్వతో ఉండే ఈ సరస్సులు అకస్మాత్తుగా ఉప్పొంగడంతో ప్రమాదకరమైన వరదలు సంభవిస్తాయి. భారీ వర్షపాతం, కొండచరియలు విరిగిపడటం, హిమసంపాతాలు, భూకంపాలు, హిమానీనదాలు కరగడం లాంటి కారణాలవల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Glacial Lake Outburst | భూటాన్‌లో హిమానీనదం విస్ఫోటనం.. బెంగాల్, అస్సాంలకు వరద ముప్పు.. కేంద్రం హైఅలర్ట్..!
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
Sir Patrick Stewart | హాలీవుడ్లో తీవ్ర విషాదం.. దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

