ఆస్ట్రాజెనికాతో బ్లడ్ క్లాటింగ్.. అరుదైన సైడ్ ఎఫెక్ట్

లండన్ : ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టినట్లు నివేదికలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై యురోపియన్ యూనియన్ వైద్య నియంత్రణ సంస్థ ఓ ప్రకటన చేసింది. రక్తం గడ్డకట్టడం అనేది అత్యంత అరుదుగా నమోదు అయ్యే సైడ్ ఎఫెక్ట్ అని మెడిసిన్స్ రెగ్యులేటర్ పేర్కొన్నది. 86 కేసులను పరిశీలించిన యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఆ అధ్యయన నివేదికను వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల నష్టాల కన్నా ఎక్కువ లాభాలు ఉన్నట్లు పేర్కొన్నది. ఇప్పటి వరకు యూరోప్ దేశాల్లో సుమారు 2.5 కోట్ల మందికి ఆస్ట్రాజెనికా టీకా వేశారు. బ్లడ్ క్లాటింగ్ జరిగిన కేసుల్లో ఎక్కువ శాతం మంది 60 ఏళ్ల లోపు మహిళలే ఉన్నట్లు ఈఎంఏ పేర్కొన్నది. 30 ఏళ్ల లోపు వారికి బ్రిటన్ ప్రభుత్వం ఆస్ట్రాజెనికా బదులుగా మరో టీకాను ఇవ్వనున్నది. మార్చి నెల చివరి నాటికి బ్రిటన్‌లో 79 మందికి బ్లడ్ క్లాటింగ్ లక్షణాలు కనిపించాయి. దాంట్లో 19 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నారని, బ్లడ్ క్లాట్ కేసులను అత్యంత అరుదైనవిగా గుర్తిస్తున్నామని ఈఎంఏ తెలిపింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ 13 కోట్ల మందికి సంక్రమించింది. 28 లక్షల మంది మరణించారు.
ఇదీ నివేదిక
ఈఎంఏ కమిటీ ఓ హెచ్చరిక కూడా చేసింది. ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నవారిలో రెండు వారాల్లోగా రక్తంలోని ప్లేట్లెట్స్ సంఖ్య క్రమంగా పడిపోతుందని వెల్లడించింది. ఈ అంశం పట్ల ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇప్పటి వరకు బ్లడ్ క్లాటింగ్ కేసులు ఎక్కువగా 60 ఏళ్ల లోపు ఆడవారిలో నమోదు అయ్యాయని, ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం ఇతర సైడ్ఎఫెక్ట్స్ ఏమీ లేవని ఈఎంఏ చెప్పింది. ఒకవేళ ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నవారిలో ప్లేట్ లెట్స్ తగ్గినట్లు గుర్తిస్తే, వాళ్లు వెంటనే డాక్టర్లను సంప్రదించాలని కూడా ఈఎంఏ సూచన చేసింది. మెదడులో ఉండే సిరలు(వెయిన్స్, సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్), ఉదరం(స్పాంచ్నిక్ వీన్ థ్రాంబోసిస్), ధమనుల్లో పలు చోట్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉన్నదని ఈఎంఏ కమిటీ పేర్కొన్నది. సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిన్కు చెందిన 62 కేసులను, స్పాన్చిక్ వీన్ థ్రాంబోసిస్కు చెందిన 24 కేసులను పరిశీలించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

