రాత్రి ఆకాశంలో భారీ డ్రాగన్ ఎగురుతూ కనిపిస్తే ఎలా ఉంటుంది? ఈ వీడియోలో అదే సీన్ కనిపిస్తుంది. నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక భారీ డ్రాగన్ ఆకాశంలో చక్కర్లు కొడుతూ కనిపించింది. దీన్ని చేయడానికి సుమారు వెయ్యి డ్రోన్స్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ డ్రోన్ డ్రాగన్ ఎక్కడ ఎగిరిందీ తెలియరాలేదు.
జియో స్కాన్ డ్రోన్ షో అనే యూట్యూబా ఛానెల్లో దీన్ని అప్లోడ్ చేసినప్పటి నుంచి తెగ వైరల్ అవుతోంది. దీన్ని ట్విట్టర్లో ఇప్పటికే 1.7 కోట్ల మంది చూశారు. 20 వేల మంది లైకులు కొట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘మైండ్ పోయింది’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘గేమ్ ఆఫ్ డ్రోన్స్’ అంటూ మరొకరు జోక్ చేశారు. ఏదేమైనా ఈ వీడియో చూసిన వాళ్లంతా ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేస్తున్నారు.