Cocaine | షార్క్ చేపల్లో కొకైన్.. ఆ నీటిని తాగటంతోనే..!
బ్రెజిల్‌లోని రియో డీ జనీరో సరిహద్దు నీటి వనరుల్లోని షార్క్ చేపల్లో కొకైన్ గుర్తించటం సంచలనం రేపింది. దీని ప్రభావంతో వాటి వ్యవహారశైలిలో మార్పులు వస్తున్నాయని, విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. వాటి కండరాల్లో సాధారణ మోతాదు కన్నా 100 రెట్లు అధికంగా కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించారు.
Cocaine | రియో డీ జనీరియో, జూలై 23: బ్రెజిల్‌లోని రియో డీ జనీరో సరిహద్దు నీటి వనరుల్లోని షార్క్ చేపల్లో కొకైన్ గుర్తించటం సంచలనం రేపింది. దీని ప్రభావంతో వాటి వ్యవహారశైలిలో మార్పులు వస్తున్నాయని, విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. వాటి కండరాల్లో సాధారణ మోతాదు కన్నా 100 రెట్లు అధికంగా కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించారు. అయితే, వీటికి కొకైన్ ఎక్కడి నుంచి వస్తున్నదో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
అక్రమంగా డ్రగ్స్ తయారుచేస్తున్న ల్యాబ్‌ల నుంచి నీటిని నీటి వనరుల్లోకి వదలటం వల్ల, ఆ నీటిని తాగటంతో షార్క్‌ల శరీరంలో కొకైన్ చేరుతున్నదన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే షార్క్‌లలో కొకైన్ స్థాయిలు అత్యధికంగా ఉన్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే.. వాటి కంటి చూపు మందగించి, వేటాడే శక్తిని కోల్పోతాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

