పిల్లలు చెడుగా ప్రవర్తిస్తే తల్లితండ్రులకు శిక్ష.. చైనాలో కొత్త చట్టం!

బీజింగ్: చైనా కొత్త విద్యా చట్టాన్ని ఆమోదించింది. సోమవారం ఆ దేశ పార్లమెంట్లో విద్యా చట్టానికి ఆమోదం దక్కింది. విద్యార్థులపై హోమ్‌వర్క్ వత్తిడి లేకుండా ఉండే రీతిలో చట్టాన్ని తెచ్చారు. ఇక స్కూల్ ముగిసిన తర్వాత ప్రైవేటు ట్యూషన్లు వెళ్లకుండా ఉండే రీతిలోనూ కొత్త చట్టాన్ని రూపొందించారు. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలవుతున్న విద్యార్థులను కూడా దారిలో పెట్టేందుకు కొత్త చట్టంలో కఠిన నిర్ణయాలను తీసుకున్నారు. చెడుగా ప్రవర్తించే, నేరాలకు పాల్పడే పిల్లల తల్లితండ్రులకు కఠిన శిక్షలు అమలు చేసే రీతిలో చట్టాన్ని తయారు చేసేందుకు ఆలోచిస్తున్నట్లు చైనా పార్లమెంట్ పేర్కొన్నది.
పిల్లలపై ఒత్తిడి పెంచుతున్న చదువులను అదుపులోకి తెచ్చేందుకు ఆయా స్థానిక ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ సూచించింది. విద్యార్థులకు కావాల్సినంత రెస్ట్ ఇవ్వాలని, వాళ్లు వ్యాయామం చేసుకునే విధంగా ప్లాన్ చేయాలన్నారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించే మెళకువలు నేర్పాలని, ఆన్లైన్ గేమ్స్‌పై మోజు తగ్గే విధంగా చూడాలన్నారు. వీడియో గేమ్స్ ఆడే మైనర్లు ఇటీవల విద్యాశాఖ మంత్రి కొత్త ఆదేశాలు జారీ చేసింది. శుక్ర, శని, ఆదివారాల్లో కేవలం గంట మాత్రమే ఆన్లైన్ ఆడేవిధంగా చూడాలని నియమావళి రూపొందించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Metro RTC Pass | రూ.8,500 పాస్ రూ.4 వేలకే.. మెట్రో-ఆర్టీసీ ధరలపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్
Sreemukhi | మత్తెక్కించే చూపులతో శ్రీముఖి..
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

