టొరంటో, ఆగస్టు 26: ఒకప్పుడు మిత్రదేశాలుగా ఉన్న అమెరికా-కెనడా ఇప్పుడు ఒకదానిపై మరొకటి వాణిజ్య యుద్ధానికి దిగుతున్నాయి. తమపై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్లపై కెనడా కూడా దీటుగా స్పందించింది. అమెరికా నుంచి కెనడాకు దిగుమతి అయ్యే 20 బిలియన్ డాలర్ల వస్తువులపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఇందులో పాల ఉత్పత్తులు, ఉపకరణాలు, వ్యవసాయ పరికరాలు, స్టీల్ తదితరమైనవి ఉన్నాయి. ఈ చర్య ప్రపంచంలోని అతి పెద్ద వాణిజ్య సంబంధాలలో ఒకదానికి ముప్పు తెచ్చిపెట్టింది. కొత్త సుంకాలు పారిశ్రామిక వస్తువులకే పరిమితం కాకుండా నిత్యావసరాలైన సీఫుడ్, చీజ్, వస్ర్తాలు, కాస్మోటిక్స్, టాయిలెట్ పేపర్ వంటి వాటిపై కూడా విధించారు. వీటిలో కొన్నింటిపై 50 శాతం వరకు అధిక సుంకాలు విధించారు.