శృంగారం చేస్తుండగా.. చీలిన పురుషాంగం
చీలిన పురుషాంగం | ఓ వ్యక్తి అలా శృంగారం చేస్తుండగా.. తన పురుషాంగం నిలువునా చీలిపోయింది. ఈ విషయాన్ని బ్రిటీష్ మెడికల్ జర్నల్ వెలుగులోకి తీసుకొచ్చింది

శృంగారం ఓ మధురమైన అనుభూతి. ఏ దంపతులైనా.. ఆ అనుభూతిని తనివితీరా పొందాలనుకుంటారు. అలా రొమాన్స్ చేస్తూ శృంగారంలో మునిగిపోతారు. తన భాగస్వామిని సుఖ పెట్టేందుకు పురుషుడు తన శక్తినంతా ఉపయోగిస్తాడు. అయితే ఓ వ్యక్తి అలా శృంగారం చేస్తుండగా.. తన పురుషాంగం నిలువునా చీలిపోయింది. ఈ విషయాన్ని బ్రిటీష్ మెడికల్ జర్నల్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఇలాంటి కేసు ప్రపంచంలోనే తొలిసారి అని పేర్కొన్నది.
యూకేకు చెందిన 40 ఏండ్ల వయసున్న ఓ వ్యక్తి తన భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నాడు. శృంగారం చేస్తున్న సమయంలో ఆమె పెరెనియం (perineum – the area between the anus and genitals) భాగంలో పురుషాంగం తీవ్ర రాపిడికి గురైంది. ఆ తర్వాత అంగస్తంభన జరిగినప్పటికీ, పురుషాంగంలో వాపు కనిపించింది. క్రమంగా పురుషాంగం మెత్తబడటంతో.. బాధిత వ్యక్తి వైద్యులను సంప్రదించాడు.
వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించగా.. పురుషాంగం లోపల 3 సెంటిమీటర్ల దూరం నిలువునా చీలిపోయిందని తేలింది. ట్యునికా అల్బుజినియా (tunica albuginea) రెండుగా చీలింది. దీంతో అతని పురుషాంగానికి వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ.. శృంగారం మాత్రం ఆరు నెలల తర్వాత చేయొచ్చు అని డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత ఎప్పటి లాగే అంగస్తంభన ఉంటుందని, ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు అని స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

