Viral Video: జేసీబీలో పెండ్లి వేదికకు వెళ్లిన కొత్త జంట

ఇస్లామాబాద్: ఇటీవల పెండ్లి చేసుకునే వధువరులు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. తమ వివాహం గురించి నలుగురు గొప్పగా చెప్పుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన ఒక జంట ఏకంగా అందంగా అలంకరించిన జేసీబీలో ప్రయాణించి వివాహ వేదికకు చేరుకున్నది. దారి పొడవునా స్థానికులు వారికి చీర్స్ చెప్పారు. పెండ్లి వేదిక వద్ద జేసీబీ నుంచి కిందకు దిగిన వధువరులకు వారి బంధువులు ఘన స్వాగతం పలికారు. టపాసులు పేల్చి సందడి చేశారు.
పాకిస్థాన్‌లోని హంజా లోయలో జరిగిన ఈ పెండ్లికి సంబంధించిన వీడియోను ఆ దేశానికి చెందిన జర్నలిస్ట్ గులాం అబ్బాస్ తన ట్విట్టర్ ఖాతాలో పొస్ట్ చేశారు. పాక్‌లోని హంజా వ్యాలీలో అడ్వెంచర్స్ వెడ్డింగ్ అని దీనికి శీర్షిక పెట్టారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలువురు నెటిజన్లు దీనిపై విభిన్నంగా కామెంట్లు చేశారు.
#VideoViral Adventures wedding in #Hunza Valley #Pakistan pic.twitter.com/ruhMmqwPYI
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) October 1, 2021
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

