టికెట్ లేకుండా విమానం ఎక్కి 2700 కిమీ ప్రయాణం చేసిన 9 ఏళ్ల బుడతడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండా.. టికెట్ లేకుండా.. సెక్యూరిటీ చెక్‌ను దాటుకొని ఎలా విమానం ఎక్కాడు.. అనే దానిపై అధికారులు
టికెట్ లేకుండా బస్సు ఎక్కొచ్చు.. రైలు ఎక్కొచ్చు.. కానీ.. విమానం ఎక్కడం కుదురుతుందా? అసలు.. టికెట్ లేకుండా సెక్యూరిటీని దాటుకొని విమానం ఎక్కగలమా. అది అసాధ్యం కదా. కానీ.. ఓ 9 ఏళ్ల బుడతడు దాన్ని సాధ్యం చేశాడు. అవును.. టికెట్ లేకుండా.. విమానం ఎక్కడమే కాదు.. సుమారు 2700 కిమీలు ఆ విమానంలో ప్రయాణించాడు. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది.
నార్త్‌వెస్టర్న్ బ్రెజిల్‌లోని మానౌస్కు చెందిన 9 ఏళ్ల ఇమ్మాన్యుయేల్ మార్క్వెస్ ఒలివెయిరా అనే 9 ఏళ్ల పిల్లోడి గురించే మనం మాట్లాడుకునేది. ఈ జనరేషన్ పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. టెక్నాలజీని వాడటంలో.. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడంలో వాళ్ల తర్వాతనే ఎవరైనా. అరచేతిలో వాళ్లకూ ప్రపంచం కనిపిస్తుండటంతో తెలిసీ తెలియని వయసులో ఊహాలోక ప్రపంచంలో విహరిస్తూ ఏదేదో చేసేస్తున్నారు.
ఎందుకంటే.. విమానంలో టికెట్ లేకుండా ఎలా ఎక్కాలి? విమాన సిబ్బందికి దొరక్కుండా ఎలా విమానంలో దాక్కోవాలి? అనే వాటి గురించి ఆ బుడతడు ముందే గూగుల్ చేసి.. అందులో సమాచారాన్ని వెతికి.. దాని ఆధారంగా టికెట్ లేకుండా విమానంలో ప్రయాణించేందుకు పూనుకున్నాడన్నమాట.

సావో పాలో స్టేట్‌లోని గౌరుల్హోస్ అనే సిటీకి వెళ్లే లాటమ్ ఫ్లైట్ ఎక్కిన ఒలివెయిరా దాదాపు 2700 కిలోమీటర్లు ఆ విమానంలోనే ప్రయాణించాడు. విమానంలో సిబ్బందికి కనిపించకుండా దాక్కున్నాడు. కానీ.. చివరకు విమాన సిబ్బందికి దొరికిపోయాడు. ఆ తర్వాత బాలుడిని వివరాలు అడిగి అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
అయితే.. ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండా.. టికెట్ లేకుండా.. సెక్యూరిటీ చెక్‌ను దాటుకొని ఎలా విమానం ఎక్కాడు.. అనే దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు.. సావో పాలోలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లేందుకే ఆ విమానాన్ని ఎక్కానని ఆ బాలుడు చెప్పడం కొసమెరుపు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- brazil boy
- flight
- manaus
- trending
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

