అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. 31 మంది మృతి
America | క్రిస్మస్ పండుగ పూట అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను ముంచెత్తింది. ఆర్కిటిక్ పేలుడు సంభవించడటంతో 48 రాష్ట్రాలు చలిగుప్పిట్లో చిక్కుకున్నాయి. తూర్పు అమెరికాలో పరిస్థితి
న్యూయార్క్: క్రిస్మస్ పండుగ పూట అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను ముంచెత్తింది. ఆర్కిటిక్ పేలుడు సంభవించడటంతో 48 రాష్ట్రాలు చలిగుప్పిట్లో చిక్కుకున్నాయి. తూర్పు అమెరికాలో పరిస్థితి మరింత భయంకరంగా మారిపోయింది. భారీ మంచు తుఫాను వల్ల న్యూర్క్ ఒక వార్ జోన్‌ను తలపిస్తున్నది. గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. విపరీతమైన చల్లని గాలులు వీస్తుండటంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 31 మంది మృతిచెందారు. పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 20 లక్షల మందికి పైగా అంధకారంలో చిక్కుకున్నారు.

న్యూయార్క్‌లో పరిస్థితి యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నదని గవర్నర్ క్యాథీ హోచుల్ అన్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనాలు వెళ్లడానికి వీల్లేకుండా పోయిందని చెప్పారు. ఇక బఫెలో లోని కొన్ని ప్రాంతాలలో 2.4 అడుగుల మేర మంచు కురిసిందని, విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ప్రమాదంలో చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. తుఫాను పరిస్థితుల్లో ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు కోరుతున్నారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: ఆర్థిక సంక్షోభ అంచుల్లో భారత్.. తీవ్ర స్థాయిలో నిరుద్యోగం: రాహుల్ గాంధీ
Munipalli | స్నానం చేస్తేనే పాఠశాలకు రావాలి..! నేను ఇంతే, నా మాటే శాసనం
Dulquer Salmaan | విమర్శలను మోటివేషన్‌గా మార్చుకుంటున్నా: దుల్కర్ సల్మాన్!
ఉసిరికాయలపల్లి ఏహెచ్ఎస్ పాఠశాలలో డీడీ ఆకస్మిక తనిఖీ
Korukanti Chander | బూడిద లారీల పేరిట కలెక్టర్ దోపిడీ..! : మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

